తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను సోమవారం అంటే ఏప్రిల్ 24 నుంచి ఆహ్వానించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ మే 24. రాత పరీక్ష ఆధారంగా పీజీటీ పోస్టులకు ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. మరోవైపు, ఇప్పటికే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9231 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే.

వీటిలో 868 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 4020 టీజీటీ పోస్టులు, 2008 జూనియర్ లెక్చరర్ పోస్టులు, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్ట్రాఫ్ట్స్, 124 మ్యూజిక్ పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.
వీటిలో జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పోస్టులకు ఏప్రిల్ 17 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. టీజీటీ మినహా మిగితా అన్ని పోస్టులకు అధికారిక నోటిఫికేషన్లు ఏప్రిల్ 24 నాటికి వెబ్‌సైట్లో అందుబాటులో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తం 300 మార్కులకు మూడు పేపర్లకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ పరిజ్ఞానంపై 100 మార్కులకు ఉంటుంది. పేపర్-3లో సబ్జెక్టు విషయ పరిజ్ఞానంపై 100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. అర్హత వయసు 18 నుంచి 44 ఏళ్లుగా నిర్ణయించారు.
జనరల్ అభ్యర్థులు 1200 ఫీజు చెల్లించాల్సి ఉంటుది. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 దరఖాస్తు రుసం చెల్లించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అధికారిక వెబ్‌సైట్ www.treirb.telangana.gov.in ద్వారా ఓటీఆర్ తో పాటు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications