తెలంగాణలో మరో నోటిఫికేషన్ విడుదల: 175 పోస్టుల కోసం అప్లై చేయండి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో వెల్లడించింది.

రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కాగా, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 23 పోస్టులను భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 10 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ సంప్రదించాలని కోరింది.

175 posts recruitment in TS municipal department: apply from sept 20th

1540 ఏఈఈ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్

రాష్ట్రంలోని పలు విభాగాల్లో 1540 సహాయక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ విభాగాల్లో ఇంజినీరింగ్ లేదా తత్సమాన అర్హత కలిగిన అభ్యర్థులతో ఈ ఉద్యోగులను భర్తీ చేయనుంది.

ఈ ప్రకటనలో అత్యధికంగా సివిల్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ సూచించారు. పోస్టుల వారీగా పూర్తి వివరాలు, వాటికి సంబంధించిన విద్యార్హతలను సెప్టెంబర్ 15న కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత (సివిల్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్ తదితర) విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+