తెలంగాణ విద్యుత్ శాఖలో 3260 కొత్త కొలువులు, త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలోని రాష్ట్ర విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయి. వరంగల్ కేంద్రంగా పనిచేసే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎన్పీడీసీఎల్)లో 2212 జూనియర్ లైన్‌మెన్ (జేఎల్ఎం), 30 సబ్ ఇంజినీర్, 18 అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులను చేయనుంది.

మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో 600 జూనియర్ లైన్‌మెన్, 300 సబ్ ఇంజినీర్, 100 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ)కి సమర్పించిన నివేదికలో పేర్కొన్నాయి.

3260 new meters in Telangana DISCOMs notification soon

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ బిజినెస్, వీలింగ్ టారిఫ్ వార్షిక ఆదాయ అవరాల పిటిషన్లలో విద్యుత్ సంస్థలు ఈ కొత్త నియామకాల అంశాన్ని ప్రస్తావించాయి. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం రెండు డిస్కంలు త్వరలోనే ఏకకాలంలో నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుందని తెలుస్తోంది. కాగా, ఈ ఐటీఐ చేసినవారు జేఎల్ఎం ఉద్యోగాలకు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసినవారు సబ్ ఇంజినీర్, బీఈ/బీటెక్ అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు అర్హులు. వీరంతా నోటిఫికేషన్లు విడుదలైన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+