నెలకు రూ.81 వేల జీతంతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..!
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఇచ్చింది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 394 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు..
అభ్యర్థులు ఇంజనీరింగ్ లో డిప్లొమా, B.Tech, B.Sc లేదా BCA డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత రంగాల్లో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..
మూడ్-స్టేజ్ ప్రాసెస్ ల ద్వారా జరుగుతుంది:
టైర్-I: ఆన్‌లైన్ పరీక్ష
టైర్-II: స్కిల్ టెస్ట్
టైర్-III: ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్
ప్రతిభావంతులైన అభ్యర్థులు లెవల్ 4 (₹25,500-₹81,100) పే స్కేల్‌లో నియమితులుగా వస్తారు.
వయస్సు & రిజర్వేషన్స్..
వయస్సు: 18-27 సంవత్సరాలు (సెప్టెంబర్ 14, 2025 నాటికి)
రిజర్వ్డ్ కేటగిరీలకు ప్రభుత్వం అందించే వయో సడలింపులు వర్తిస్తాయి
దరఖాస్తు ప్రక్రియ..
ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 23, 2025 నుండి ప్రారంభం
చివరి తేదీ: సెప్టెంబర్ 14, 2025
ఎంపికైన ఉద్యోగులకు ప్రవేశ శిక్షణ (Induction Training) ఇవ్వబడుతుంది, ఇందులో నేషనల్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విధానాలు, సైబర్ సెక్యూరిటీ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్పిస్తారు.
ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రవేశానికి అత్యుత్తమ అవకాశంగా చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications