నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: లక్షకుపైగా జీతం, వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలో ఉన్న నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఆస్పత్రిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ విడుదల చేసింది. 46 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అనస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్, హెమటాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ జెనెటిక్స్, నెఫ్రాలజీ, న్యూరో సర్జన్, ఆర్థోపెడిక్స్, పాథాలజీ తదితర స్పెషలైజేషన్లలో ఖాళీలున్నాయి.
సంబంధిత విభాగాల్లో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/డీఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దీంతోపాటు మూడేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి.
వయస్సు తప్పనిసరిగా 50 ఏళ్లకు మించివుండకూడదు.
డిసెంబర్ 17, 2022 తేదీలోపు ఆఫ్‌లైన్ ద్వారా ఈ కింది చిరునామాకు ఆసక్తికలిగినవారు దరఖాస్తు సమర్పించాలి.

దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికైనవారికి నెలకు రూ. 1,23,100 వరకు జీతంగా చెల్లిస్తారు.
అధికారిక నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.nims.edu.in/ సందర్శించవచ్చు.












Click it and Unblock the Notifications