అగ్నిపథ్: అగ్నివీరులకు అండగా నిలుస్తామంటున్న టాటా సహా పారిశ్రామిక దిగ్గజాలు

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి సంబంధించి సోమవారం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నిరసనలు వెల్లువెత్తినప్పటికీ.. ఈ పథకంపై ముందుకే సాగుతామని త్రివిధ దళాలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అగ్నిపథకంపై చేపట్టి భర్తీ చేసిన పోస్టుల్లో దాదాపు 75శాతం మంది నాలుగేళ్ల తర్వాత భారీ ఆర్థిక ప్యాకేజీతో రిటైరవుతారు.

కాగా, 'అగ్నిపథ్' పథకం ద్వారా ఎంపికైన అగ్నివీర్‌లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఇప్పటికే ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో పారిశ్రామిక వేత్త చేరారు. ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ చైర్మన్ హర్ష్ గోయెంకా కూడా 'అగ్నివీర్'లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.ఈ మేరకు సోమవారం ట్విట్టర్‌లో ప్రకటన చేశారు.

Agnipath: anand mahindra and harsh goenka extends support to future agniveers

'ఆర్‌పీజీ సంస్థ 'అగ్నివీర్'లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా మాతోపాటు (ఆనంద్ మహీంద్రాతో కలిపి) చేరుతాయనుకుంటున్నా. మన యువత భవిష్యత్తు కోసం ఈ హామీ ఇవ్వాలి' అని హర్ష్ గోయెంకా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తెలంగాణతోపాటు, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్, హర్యానా వంటి రాష్ట్రాల్లో 'అగ్నిపథ్' స్కీంకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో చేరడం వల్ల తమ భవిష్యత్తుకు రక్షణ లేకుండా పోతుందని యువత భావిస్తోంది. నాలుగేళ్ల తర్వాత తమ భవిత ఏంటని ప్రశ్నిస్తోంది. అయితే, భారీ ఆర్థిక ప్యాకేజీతోపాటు వివిధ పోస్టుల భర్తీలో 10 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఈ నేపథ్యంలో 'అగ్నివీర్'లుగా చేరిన యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకా వంటి కార్పొరేట్లు ముందుకొస్తున్నారు. తాజాగా, అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. జులై నెల నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

గొప్ప అవకాశమంటూ ముందుకొచ్చిన టాటా

జూన్ 20న టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్.. కేంద్రం అగ్నిపథ్ పథకానికి మద్దతు ఇచ్చారు. యువతకు రక్షణ దళాలకు సేవ చేసే అవకాశంతో పాటు, టాటా గ్రూప్‌తో సహా పరిశ్రమకు చాలా క్రమశిక్షణ, శిక్షణ పొందిన వర్క్‌ఫోర్స్‌ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

'అగ్నిపథ్ యువతకు దేశ రక్షణ దళాలకు సేవ చేయడానికి గొప్ప అవకాశం మాత్రమే కాదు, ఇది టాటా గ్రూప్‌తో సహా పరిశ్రమ కోసం చాలా క్రమశిక్షణ, శిక్షణ పొందిన యువతను అందుబాటులోకి తెస్తుంది’ అని చంద్రశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు. అతను ఇంకా మాట్లాడుతూ.. "టాటా గ్రూప్‌లో మేము అగ్నివీర్స్ సామర్థ్యాన్ని గుర్తించాము. ఇది ప్రాతినిధ్యం వహిస్తున్న అవకాశాన్ని స్వాగతిస్తున్నాము’ అని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+