ఇంటర్ అర్హతతో భారతీయ వాయుసేనలో అగ్నివీర్ నోటిఫికేషన్..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. అగ్నిపథ్ పథకంలో భాగంగా భారతీయ వాయుసేనలో అగ్నివీర్ ఎంపికల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. అగ్నివీర్ నియామకాల కోసం జూలై 8వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి.
ఈ ఎంపిక పరీక్షకు అవివాహితులైన భారతీయ పురుషులు, మహిళా అభ్యర్థుల నుండి అగ్నివీర్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. జూలై 28వ తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంపిక పరీక్షలు అక్టోబర్ 18, 2024 నుంచి జరుగుతాయి. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం https://agnipathvayu.cdac.in ఈ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

అగ్నివీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు సైన్స్ సబ్జెక్ట్స్ అభ్యర్థులు కోర్ సబ్జెక్టుల్లో సగటున కనీసం 50% మార్కులతో పాటు ఇంగ్లిష్ లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి మేథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ 10+2/ సరిసమాన పరీక్ష లో ఉత్తీర్ణులై ఉన్నవారు అర్హులు.
వీటితో పాటు సైన్స్ సబ్జెక్టులు కాకుండా యాభై శాతం మార్కులతో కేంద్ర, రాష్ట్ర మరియు UTచే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి ఏవేని స్ట్రీమ్ / సబ్జెక్టులలో ఇంటర్మీడియట్/ 10+2 / సరిసమాన పరీక్ష ఉతీర్ణత పొంది ఉన్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు జూలై 3, 2004 నుంచి 2008 జనవరి 3 మధ్యకాలంలో జన్మించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి ఎంపిక ప్రక్రియలో అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధిస్తే, నమోదు తేదీ నాటికి అతని / ఆమె గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు పూర్తయి ఉండాలి.












Click it and Unblock the Notifications