రూ.1,48,200 జీతంతో AIIMSలో ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ డేట్ !

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS Mangalagiri) మంగళగిరి తీపి కబురు ప్రకటించింది. రెగ్యులర్‌ విధానంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్‌, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ చేయనుంది. మొత్తం 121 బోధనా సిబ్బంది పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సెలెక్ట్ అయిన వారికి నెలకు రూ.1,68,900 వరకు జీతం ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత, ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు..

121

పోస్టుల వివరాలు..

ప్రొఫెసర్ - 10 పోస్టులు

అడిషనల్ ప్రొఫెసర్ - 08 పోస్టులు

అసోసియేట్ ప్రొఫెసర్ - 20 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్ - 83 పోస్టులు

aiims-mangalagiri-notification-for-121-jobs-with-huge-salary

అర్హతలు..

ఎంబీబీఎస్‌, ఎంఎస్‌, ఎండీ, ఎంహెచ్ ఉత్తీర్ణత తప్పనిసరి.

కనీసం 60 శాతం మార్కులు ఉండాలి.

సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

వయోపరిమితి & సడలింపులు..

గరిష్ట వయసు: 58 సంవత్సరాలు

సడలింపులు..

ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు - 5 సంవత్సరాలు

ఓబీసీ అభ్యర్థులకు - 3 సంవత్సరాలు

పీడబ్ల్యూబీడీ (PwBD) అభ్యర్థులకు - 10 సంవత్సరాలు

ప్రభుత్వ ఉద్యోగులకు - 5 సంవత్సరాలు

వేతనాలు..

(7వ వేతన కమిషన్ ప్రకారం):

ప్రొఫెసర్ - రూ.1,68,900/- నెలకు

అడిషనల్ ప్రొఫెసర్ - రూ.1,48,200/- నెలకు

అసోసియేట్ ప్రొఫెసర్ - రూ.1,38,300/- నెలకు

అసిస్టెంట్ ప్రొఫెసర్ - రూ.1,01,500/- నెలకు

దరఖాస్తు వివరాలు..

ఆన్‌లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు గడువు..

చివరి తేదీ: అక్టోబర్ 26, 2025

దరఖాస్తు రుసుము..

జనరల్ / EWS / OBC - రూ.3,100/-

ఎస్సీ / ఎస్టీ / మహిళా అభ్యర్థులు - రూ.2,100/-

PwBD అభ్యర్థులకు - రుసుము లేదు

ఎంపిక విధానం..

ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.

ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు సర్టిఫికేట్లు, అనుభవ ధ్రువపత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలి.

ముఖ్య సూచనలు..

అభ్యర్థులు ముందుగానే అవసరమైన పత్రాలను స్కాన్ కాపీలు సిద్ధం చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాతే ఫీజు చెల్లింపు ఆప్షన్ యాక్టివ్ అవుతుంది.

ఇంటర్వ్యూ తేదీలు, షెడ్యూల్ వేరుగా వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉంటే వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ aiimsmangalagiri.edu.in/vacancies చూడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+