ఏఏఐ బంపర్ ఆఫర్.. రూ.1,40,000 జీతంతో ఉద్యోగాలు !
నిరుద్యోగ అభ్యర్థులకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తీపికబురు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేయనుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారిని ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
మొత్తం ఖాళీలు..
976
పోస్టులు - వెకెన్సీలు..
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 11 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్): 199 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్): 208 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 527 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ): 31 పోస్టులు

విద్యార్హతలు..
సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి (ఆర్కిటెక్చర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ). వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
దరఖాస్తు గడువు..
- దరఖాస్తు ప్రారంభం: 2025 ఆగస్టు 28
- దరఖాస్తు చివరి తేది: 2025 సెప్టెంబర్ 27
వయస్సు పరిమితి..
- సాధారణ అభ్యర్థులకు: 27 ఏళ్లు మించరాదు (సెప్టెంబర్ 27, 2025 నాటికి).
- OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాల వయస్సు సడలింపు.
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాల వయస్సు సడలింపు.
- దివ్యాంగులకు: 10 సంవత్సరాల సడలింపు.
ఎంపిక విధానం..
- అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
- రాత పరీక్ష తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ జరుగుతుంది.
- ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగానే ఉంటుంది.
జీతం & వేతనాలు..
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు భారీ వేతనం లభిస్తుంది. అదనంగా ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
దరఖాస్తు ఫీజు..
- సాధారణ అభ్యర్థులకు: రూ.300
- SC/ST/దివ్యాంగ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://www.aai.aero/en/recruitment/release/618077 ను సందర్శించవచ్చు.












Click it and Unblock the Notifications