ఈ నెల 26 నుంచి CSIR యూజీసి పరీక్షలు.. అడ్మిట్ కార్డు విడుదల...
సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ అడ్మిట్ కార్డు విడుదల చేసింది. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ డిసెంబర్ సెషన్‌కు సంబంధించి అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్-2023 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిసెంబరు 22న విడుదల చేసింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ముఖ్య కేంద్రాల్లో ఈ నెల 26, 27, 28 తేదీల్లో సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతల కోసం నిర్వహించే పరీక్ష. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రీసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ పరీక్షలో అర్హత సాధిస్తే యూనివర్సిటీలు లేదా డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యే అవకాశం ఉంటుంది. సీఎస్ఐఆర్ యూజీసి నెట్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. సిబిటి విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. అబ్జక్టివ్ విధానంలో ప్రశ్నలుంటాయి.

సీఎస్‌ఐఆర్ నెట్ పరీక్ష మొత్తం ఐదు విభాగాల్లో ఉంటుంది. కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్. 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. అవి పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి. పరీక్ష సమయం 3 గంటలు. ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి.
తెలుగు రాష్ట్రల్లో పరీక్ష కేంద్రాలు : డిసెంబరు 26, 27, 28 తేదీల్లో సీఎస్ఐఆర్ యూజీసి నెట్ పరీక్షలు జరగునున్నాయి. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉ.9.00 గం.- మ.12.00 గం. వరకు మొదటి సెషన్‌లో, మ. 2.00 గం.-సా.5.00 గం. వరకు రెండో సెషన్‌లో పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా 225 నగరాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.












Click it and Unblock the Notifications