గ్రూప్ 1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. త్వ‌ర‌లోనే ప్రిలిమ్స్ ఫ‌లితాలు..

తెలంగాణ గ్రూప్ 1 అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. త్వ‌ర‌లోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. ఇప్పటికే ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక‌, త్వ‌ర‌లోనే ప్రిలిమ్స్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. మరోవైపు మెయిన్స్ కు 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు.

జూన్ 9వ తేదిన తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష‌కు మొత్తం 3.02 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఇదిలా ఉండ‌గా, మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదలైంది. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు ఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇప్పటికే కీలు విడుదల కావటంతో పాటు అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. మరోవైపు ఓఎంఆర్ ఇమేజింగ్ పత్రాలు కూడా అభ్య‌ర్థుల కోసం వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ రెండు మూడు రోజులు లేదా జూలై ఫ‌స్ట్ వీక్‌లో ఫ‌లితాలు వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుఉస్తోంది. అయితే ఈసారి మెయిన్స్ కు ఏ నిష్పత్తిలో ఎంపిక చేస్తారనే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

Alert for Group 1 candidates Prelims results soon

గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష విధానం ఇదే..

గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు జ‌రుగుతాయి. మెయిన్స్ పరీక్ష ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో మాత్ర‌మే ఉంటుంది. మెయిన్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాల్సి ఉంటుంది.

ప‌రీక్షా తేదీలివే..

అక్టోబర్ 21.2024 జనరల్ ఇంగ్లిష్(క్వాలిఫైయింగ్ పేపర్)
అక్టోబర్ 22.2024 పేపర్-I (జనరల్ ఎస్సే)
అక్టోబర్ 23.2024 పేపర్-II (చరిత్ర, సంస్కృతి, భూగోళశాస్త్రం)
అక్టోబర్ 24.2024 పేపర్ -III (ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్)
అక్టోబర్ 25.2024 పేపర్ -IV (ఎకానమీ, డెవలప్మెంట్)
అక్టోబ్ 26.2024 పేపర్- V (సైన్స్ &సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్ )
అక్టోబర్ 27.2024 పేపర్-VI (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణం)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+