లాసెట్ అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ లాసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..
తెలంగాణ లాసెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి లాసెట్ 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. లాసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌లో భాగంగా వచ్చే నెల 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రక్రియ ఆగస్టు 20వ తేదీతో ముగుస్తోంది. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం జనరల్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్‌టి దివ్యాంగ అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్లించాలి. వీటితోపాటు వచ్చేనెల (ఆగస్టు) 22వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 23వ తేదీతో వెబ్ ఆప్షన్ల గడువు పూర్తి కానుంది. ఆగస్టు 24వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వచ్చే నెల (ఆగస్టు) 27వ తేదీన లాసెట్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
లాసెట్ 2024 సీట్లు పొందిన విద్యార్థులు వచ్చే నెల (ఆగస్టు) 28వ తేది నుంచి 30వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి సమాచారం కోసం, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు లాసెట్ అధికారిక వెబ్‌సైట్‌ను https://lawcet.tsche.ac.in/ సంప్రదించగలరు. ఇక, టీజీ లాసెట్ 2024 రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు త్వరలోనే ఖరారు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.

72.66 శాతం ఉత్తీర్ణత..
2024-2025 విద్యా సంవత్సరానికి గానీ తెలంగాణ రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ లాసెట్ పరీక్షలు జూన్ 3వ తేదీన జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ లాసెట్ పరీక్షకు 2024 మొత్తం 40,268 మంది హాజరుకాగా, వీరిలో 29,258 మంది ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా టీజీ లాసెట్ 2024లో 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయినట్లు అధికారులు వివరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications