CAT Exam: రేపటి క్యాట్ ఎగ్జామ్‌కు ఏర్పాట్లు పూర్తి.. కట్టుదిట్టమైన భద్రత కోసం తొలిసారి వాటి వినియోగం

Mobile Jammers: ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇప్పటి యువత పలు రకాల ఎంట్రన్స్ టెస్టులను ఎదుర్కోవాల్సి వస్తుంది. IIMలు మినహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కాలేజీల్లో MBA కోర్సులో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CAT) నిర్వహించబడుతుంది. ఇందులో ప్రతిభ ఆధారంగా ఆయా కళాశాలలను విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తాయి. రేపు జరగనున్న ఈ పరీక్షకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

నవంబర్ 24న కంప్యూటర్ ఆధారిత విధానంలో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) మూడు సెషన్లుగా నిర్వహించబడుతుంది. ఇందుకోసం అర్హత కలిగిన అభ్యర్థులకు ఇప్పటికే అడ్మిట్ కార్డులు జారీ చేయబడ్డాయి. అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in ద్వారా తమ CAT అప్లికేషన్ లాగిన్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.

All arrangements are ready for tomorrow CAT exam with extra precautions

3.29 లక్షల మంది అర్హులైన అభ్యర్థుల అడ్మిట్ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 170 నగరాల్లోని పలు పరీక్ష కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. అయితే ఈ ఏడాది పరీక్షలు నిర్వహించే IIM భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో మొబైల్ జామర్లను సైతం అమర్చనున్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఇక అభ్యర్థుల ప్రిపరేషన్ కోసం IIM కాలకత్తా CAT 2024 మాక్ టెస్ట్ లింక్‌లను విడుదల చేసింది. పరీక్షకు రెండు రోజుల ముందు నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యమయ్యే లింక్ ద్వారా ఈ మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయవచ్చు. పరీక్ష నమూనా పట్ల అభ్యర్థులకు అవగాహన కల్పించడం మరియు రివిజన్‌కు సహాయపడడమే లక్ష్యంగా వీటిని రూపొందించింది.

మూడు సెషన్లలో నిర్వహించబడే ఈ పరీక్ష ప్రతి సెషన్ 2 గంటల పాటు ఉంటుంది. వర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రిహెన్షన్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. కాగా ప్రతి విభాగానికి 40 నిమిషాల సమయ పరిమితి విధించబడింది. పరీక్షకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక CAT వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+