AP AHA Result: నేడే పశుసంవర్ధక శాఖ సహాయకుల ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
నేడే ఎపీలోని పశుసంవర్థక శాఖ సహాయకుల ఫలితాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ సబార్డినేట్ సర్వీసెస్‌లో సహాయకుల పోస్టులను విడుదల చేసింది. ఈ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన విడుదల చేసింది. మొత్తం 1,896 పశు సంవర్ధక సహాయకులు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయిన విషయం అందరికీ తెలిసిందే. యానిమల్ హస్బెండరీ పోస్టులకు సంబంధించిన రాతపరీక్ష ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష తుది కీ ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ విడుదల చేసింది. జనవరి 17 అంటే ఈ రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.
యానిమల్ హస్బెండరీ ఫలితాలను జనవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్లు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. గతేడాది డిసెంబర్ 31వ తేదీన ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 150 మార్కులకు గాను ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీ ని కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి ఎంపికయిన వారికి ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో రెండెళ్లు పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఇక, అభ్యర్థులు పరీక్ష ఫలితాలను తెలుసుకునేందుకు https://apaha-recruitment.aptonline.in/ ఈ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.

ఈ పోస్టులకు ఎంపికయినవారికి నెలకు రూ.22,460 - రూ.72,810 వేతనం ఉంటుంది.
పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
అనంతపురం-473,
చిత్తూరు-100,
కర్నూలు-252,
వైఎస్సార్ కడప-210,
ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు-143,
ప్రకాశం-177,
గుంటూరు-229,
కృష్ణా-120,
పశ్చిమ గోదావరి-102,
తూర్పు గోదావరి-15,
విశాఖపట్నం-28,
విజయనగరం-13,
శ్రీకాకుళం-34 పోస్టులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications