ఏపీ డీఈఈసెట్ 2024 ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
ఆంధ్ర్రప్రదేశ్ డీఈఈసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన AP DEECET-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ పరీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్‌లు/ ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు పొందొచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల (మే) 24న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోగలరు. జూన్ 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కూడా కల్పించింది. జూన్ 10న సీట్ల కేటాయింపు, జూన్ 12 నుంచి 15 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
ఏపీ డీఈఈసెట్ 2024 ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా మే 24న 19 కేంద్రాల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 4,949 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో సీటు కేటాయించడం జరుగుతుంది. మొత్తం సీట్లలో మ్యాథమెటిక్స్- 25%, ఫిజికల్ సైన్స్- 25%, బయోలాజికల్ సైన్స్- 25%, సోషల్ స్టడీస్- 25% సీట్లను కేటాయిస్తారు.

కౌన్సిలింగ్ డేట్లు వచ్చేసాయ్..
డీఈఈసెట్ ర్యాంకు ద్వారా ఏపీలోని ప్రభుత్వ డైట్ కళాశాలలు, ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డీఈఈసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి విడత కౌన్సెలింగ్‌కు వెబ్ ఐచ్ఛికాలను జూన్ 6వ తేది నుంచి 8 వ తేది వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. వెబ్‌ఆప్షన్ల ఆధారంగా మెరిట్ జాబితాను జూన్ 10వ తేదిన ప్రకటిస్తారు. అనంతరం ఏపీలోని సంబంధిత డైట్ కళాశాలల్లో జూన్ 12వ తేది నుంచి 15 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications