ఏపీ ఈఏపీసెట్ 2024 ఫ‌లితాలు విడుద‌ల‌.. స్కోర్‌కార్డ్‌ను ఇలా చెక్ చేసుకోండి..!

ఏపీ ఈఏపీసెట్ 2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారమే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈఏపీసెట్ ఫ‌లితాల‌ను నేటి (జూన్ 11) సాయంత్రం నాలుగగంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేశారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం ఈఏపీసెట్‌ 2024 ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ప‌రీక్ష ఫలితాలను తాజాగా ఏపీ ఈఏపీసెట్‌ సెట్‌ ఛైర్మన్, జేఎన్‌టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ రామమోహన్‌రావు సంయుక్తంగా విడుదల చేశారు. ఇక‌, ఈ సంవ‌త్సరం ఈఏపీసెట్ జేఎన్‌టీయూ- కాకినాడ ఆధ్వ‌ర్యంలో జ‌రిగింది. అధికారులు ఫలితాలను అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in పొందుప‌రిచారు. ఈ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి త‌మ రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్‌, హాల్‌టిక్కెట్ నెంబ‌ర్ ద్వారా ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను నేరుగా చెక్ చేసుకునేందుకు అభ్య‌ర్థులు ఈ లింక్‌పై https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetResult.aspx క్లిక్ చేయాల్సి ఉంటుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏపీసెట్ ప‌రీక్ష‌లు మే 16వ తేది నుంచి 23వ తేది వరకు జ‌రిగాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 3,62,851 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా, అందులో 3,39,139 మంది అభ్య‌ర్థులు ఈ పరీక్ష రాశారు, వీరిలో ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు సంబంధించి 80,766 మంది పరీక్షలకు హాజరైనట్లు అధికారులు వెల్ల‌డించారు. ఇంజినీరింగ్ ప‌రీక్ష‌కు 2,74,213 మంది దరఖాస్తు చేసుకుంటే, 2,58,374 మంది ప‌రీక్ష‌కు హాజరయ్యారు. వారిలో 1,95092 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 75.51 ఉత్తీర్ణత శాతం వ‌చ్చింది. అగ్రికల్చర్ పరీక్ష కోసం 88638 మంది దరఖాస్తు చేసుకుంటే, పరీక్షకు 80,766 మంది హాజరయ్యారు. వారిలో 70,352 మంది క్వాలిఫై అయ్యారు.. ఉత్తీర్ణత శాతం 87.11 ఈఏపీసెట్ ప‌రీక్ష‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియట్‌ వెయిటేజీ మార్కులు రెండింటి ఆధారంగా తుది ర్యాంకులను ప్ర‌క‌టిస్తారు.

AP EAPCET 2024 Result Released Check Scorecard Like This

ఫ‌లితాల‌ను చెక్ చేసుకునే విధానం..

ఈఏపీసెట్ ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో AP EAPCET 2024 అని ఉంటుంది. దాని కిందే Results for AP EAPCET - 2024 అనే ఆఫ్ష‌న్ క‌నిపిస్తుంటుంది. దానికిందే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్లను న‌మోదు చేయాల్సి ఉంటుంది. అవి న‌మోదు చేశాక View Results పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెంట‌నే మీ ఫ‌లితాలు క‌నిపిస్తాయి. వెంట‌నే ఆ ర్యాంకు కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోగ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+