AP Forest Range Officer : అటవీశాఖలో ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం...
ఏపీ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 37 ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించొచ్చు. ఈ పోస్టులకు రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఈ వెబ్‌సైట్‌ను https://psc.ap.gov.in/ సంప్రదించొచ్చు.
ఇతర పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
వయసు : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము : జనరల్, ఓబిసి అభ్యర్థులు రూ. 250 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు, పరీక్ష ఫీజు రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ, బీసీ/ఎక్స్ సర్విస్‌మెన్ తదితరులకు పరీక్ష ఫీజు రూ.120 నుంచి మినహాయింపు ఉంటుంది.
వేతనం : ఈ ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు నెలకు రూ. 48,000 నుంచి రూ. 1,37,220 వేతనంగా నిర్ణయించారు.

విద్యార్హత : సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్ / కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ (అగ్రికల్చర్/ కెమికల్ / సివిల్ / కంప్యూటర్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /మెకానికల్) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ, జాగ్రఫీ, హార్టీకల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ విభాగాల్లో తత్సమాన విద్యార్హతతో పాటు నోటిఫికేషన్‌లో చూపిన విధంగా శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications