Mega Dsc 2024: ఏపీ మెగా డీఎస్సీలో మరో ట్విస్ట్..! అభ్యర్ధులకు అలా ఊరట..!
ఏపీలో ఎన్డీయే కూటమి ఎన్నికల హామీ అయిన మెగా డీఎస్సీ ఫైలుపై నిన్న సీఎం చంద్రబాబు తన తొలి సంతకం చేశారు. అయితే డీఎస్సీ నిర్వహణ విషయంలో మరో మరో ట్విస్ట్ ఇచ్చారు. అలాగే 25 వేల పోస్టుల వరకూ డీఎస్సీలో భర్తీ చేస్తామని చెప్పినా 16 వేల పోస్టులకే పరిమితం చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ మరింత ఉత్కంఠ రేపుతోంది. దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో 16347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు అనుమతిస్తూ చంద్రబాబు నిన్న సంతకం చేశారు. కానీ దీనికి అనుగుణంగా డీఎస్సీ వెంటనే నిర్వహించే పరిస్ధితి మాత్రం కనిపించడం లేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి, ఇతరత్రా కారణాల నేపథ్యంలో డీఎస్సీ ఆలస్యం కాబోతున్నట్లు తెలుస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీకి ఆరు నెలలు అంటే డిసెంబర్ వరకూ ప్రభుత్వం గడువు పెట్టుకోవడమే ఇందుకు కారణం.

వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం 6 వేల పోస్టులతో ఎన్నికలకు ముందు హడావిడిగా ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను ఆ తర్వాత హైకోర్టు రద్దు చేయడంతో కొత్త నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దాని ప్రకారం మే నెలలోనే డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఈసీ అడ్డంకులతో ఇవి నిరవధికంగా వాయిదా పడ్డాయి. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో దానికి మరో 10 వేల పోస్టులను జత చేసింది. దీంతో పాటు ఆర్ధికంగానూ పడే భారాన్ని చూసుకోవాల్సిన పరిస్ధితి.
ఈ ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం ఇంకా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. వైసీపీ ప్రభుత్వం చివర్లో ఓటాన్ బడ్జెట్ తో సరిపెట్టింది. దీని పొడిగిస్తారా లేక త్వరలో పూర్తిస్దాయి బడ్జెట్ ప్రవేశపెడతారో తెలియదు. ఇది తేలాకే డీఎస్సీ నిర్వహణపై క్లారిటీ రానుంది. ఎందుకంటే 16347 పోస్టుల భర్తీ చేయాలంటే దానికి తగిన బడ్జెట్ కూడా ఉండాలి. లేకపోతే ఉద్యోగులను నియమించినా వారికి జీతాలు ఇవ్వలేరు. కాబట్టి పూర్తిస్థాయి బడ్డెట్ ప్రవేశపెట్టాక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై క్లారిటీ రానుంది.
మరోవైపు అభ్యర్ధులకు మాత్రం ప్రభుత్వ నిర్ణయం ఊరటగానే ఉంది. ఎందుకంటే కచ్చితంగా డీఎస్సీ ఉంటుందనే క్లారిటీ వచ్చింది కాబట్టి వారు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం లభిస్తోంది. ప్రభుత్వం తాజా అంచనాలను బట్టి చూసినా డీఎస్సీ పరీక్ష నిర్వహణ మరో రెండు, మూడు నెలల తర్వాతే ఉండేలా కనిపిస్తోంది. ఈ సమయం అంతా పక్కాగా పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్ధులు వాడుకోవచ్చు.












Click it and Unblock the Notifications