ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..!

ఏపీలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునే గురుకులాల్లోని వివిధ తరగతులకు, అలాగే జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లపై ప్రభుత్వం (ap govt) మరో అప్డేట్ ఇచ్చింది. ఆయా విద్య సంస్థల్లో ప్రవేశాల కోసం గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఏ కృష్ణమోహన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 7 వరకు పొడిగించినట్లు కార్యదర్శి కృష్ణమోహన్ వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లోని 5, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన ఖాళీలు (APRS CAT-2026) మరియు ఇంటర్, డిగ్రీ మొదటి ఏడాది (APRJC & DC CET-2026) ప్రవేశాలకు ఈ గడువు వర్తిస్తుందన్నారు.

AP Govt Extends Admissions to Gurukul Junior amp amp Degree Colleges

అలాగే ఆయా తరగతుల్లో ప్రవేశాలకు అర్హత గల అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఏప్రిల్ ఏడో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఆన్లైన్లో కాకుండా నేరుగా సంస్థకు, గురుకుల విద్యాలయానికి స్వయంగా కానీ పోస్టు లేదా ఈమెయిల్ ద్వారా కానీ పంపిన దరఖాస్తులు పరిశీలించబడవని అట్టి అభ్యర్థులను పరీక్షకు అనుమతించటం జరగదని రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఏ కృష్ణమోహన్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+