AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..!
ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు (AP Inter Results 2026) ఇవాళ విడుదల అయ్యాయి. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలపై రాత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అధికారులు వేర్వేరు ప్రకటనలు చేశారు. ఇంటర్ విద్యార్ధులు ఫలితాలు విడుదల కాగానే ఎలా చెక్ చేసుకోవాలో వివరాలు వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆన్ లైన్లో ఫలితాలు అప్ లోడ్ చేశారు.
ఇవాళ ఉదయం 10 గంటల 31 నిమిషాలకు కచ్చితంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. వీటిని అధికారిక వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in లో చెక్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు ఎంటర్ చేస్తే వెబ్ సైట్లో ఫలితాలు కనిపిస్తాయి. వాటిని ప్రింట్, డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

అలాగే వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ నంబర్ 9552300009 ను ఫోన్లో సేవ్ చేసుకుని, మన మిత్రకు "Hi" అని పంపాలి. అక్కడ కనిపించే ఆప్షన్లను ఎంచుకోవడం, హాల్ టికెట్, ఇతర వివరాలను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. వీటిని సేవ్ చేసుకునేందుకు, ప్రింట్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫలితాల విడుదల తర్వాత సప్లిమెంటరీ పరీక్షలు, ఇతర వివరాలను అధికారులు విడుదల చేస్తారు. ఈ ఏడాది ఏపీలో ఇంటర్ 1వ, 2వ సంవత్సరం పరీక్షలకు మొత్తం 10.57 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ లో 5.31 లక్షలకు పైగా విద్యార్ధులు హాజరయ్యారు. అలాగే 2వ సంవత్సరంలో 5.26 లక్షల మంది పరీక్షలకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications