AP Inter Results 2025: ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్ పరీక్షా ఫలితాలను ఇవాళ ఆన్ లైన్ తో పాటు వాట్సాప్ లోనూ ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే వీటిని ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఫలితాల వెబ్ సైట్ తో పాటు ఇతర వివరాలను వెల్లడించారు.

AP Intermediate exam 2025 results out- here is how to check

విద్యార్థులు తమ ఫలితాలను https://resultsbie.ap.gov.in లో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చని విద్యామంత్రి నారా లోకేష్ ట్వీట్ లో తెలిపారు. అలాగే, 9552300009 కు మన మిత్ర వాట్సాప్ నంబర్‌కు "హాయ్" సందేశం పంపడం ద్వారా ఫలితాలను యాక్సెస్ చేయవచ్చన్నారు. ఈ సంవత్సరం ఇంటర్ పరీక్షా ఫలితాలు గత దశాబ్దంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసుకున్న విషయం మీతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.

మొదటి సంవత్సరంలో 70% ఉత్తీర్ణత, రెండవ సంవత్సరం విద్యార్థులు 83% ఉత్తీర్ణత నమోదు చేసారని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వ నిర్వహణలోని విద్యాసంస్థలలో ఈ మెరుగుదల నమోదు కావడం గొప్ప విషయం అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో, రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 10 సంవత్సరాల గరిష్ట స్థాయి 69%కి చేరుకుందని లోకేష్ తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతం వద్ద ఉందన్నారు. ఇది గత దశాబ్దంలో రెండవ అత్యధికం అన్నారు.

ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్ల కృషికి, విద్యా నైపుణ్యం కోసం అందరి ప్రయత్నాలకు నిదర్శనమని లోకేష్ తెలిపారు. ఈసారి విజయం సాధించలేకపోయిన వారూ నిరుత్సాహపడకండని లోకేష్ సూచించారు. దీన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలన్నారు. కష్టపడి పనిచేయండి, బలంగా తిరిగి రండని వారిని కోరారు. పరీక్ష రాసిన విద్యార్థులు అందరికీ వారి భవిష్యత్ ప్రయత్నాలలో శుభాకాంక్షలు తెలిపారు. నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం, విజయం సాధించడం కొనసాగించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+