AP Inter Hall Tickets 2025: ఇంటర్ హాల్ టికెట్ల డౌన్లోడ్ ఇలా-వాట్సాప్ లోనూ..!
ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేయబోతోంది. ఈ ఏడాది ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు హాల్ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తోంది. వీటిని అభ్యర్ధులు డౌన్ లోడ్ చేసుకుని పరీక్షకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లోనూ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.
ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్ధులకు హాల్ టికెట్లు ఇవాళ విడుదల చేస్తున్నారు. అధికారిక వెబ్ సైట్ www.bie.ap.gov.in లోకి వెళ్లి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లగానే హోం పేజ్ లోనే డౌన్ లోడ్ హాల్ టికెట్ 2025 ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ప్రాక్టికల్ హాల్ టికెట్ ఆప్షన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్‌మిట్ బటన్ నొక్కితే హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.

అలాగే ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులు ప్రభుత్వం తాజాగా అందుబాటులోకి తెచ్చిన మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009ను సేవ్ చేసుకుని ఇంటర్ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ వాట్సాప్ నంబర్ ను సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పెడితే వివిధ సర్వీసులు కనిపిస్తాయి. వీటిలో విద్యా సేవలపై క్లిక్ చేస్తే పరీక్ష హాల్ టికెట్ డౌన్ లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్లోనే డౌన్లోడ్ అవుతుంది.
ఏపీలో ఈ ఏడాది ఇంటర్ మీడియట్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి జరగనున్నాయి. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే విద్యార్ధుల కోసం ఇవాళ ఇంటర్ బోర్డు హాల్ టికెట్లను విడుదల చేస్తోంది. వీటిని అధికారిక వెబ్ సైట్ లో లేదా మొబైల్ వాట్సాప్ లో డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పరీక్షకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications