JOB Notification : మరో వారం రోజులే టైమ్.. వెంటనే అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు కీలక అవకాశం లభించింది. సమగ్ర శిక్ష (Samagra Shiksha) పరిధిలో పనిచేస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBVs) లో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ మరియు పార్ట్-టైమ్ టీచింగ్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యా శాఖ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టైప్-III, టైప్-IV KGBVs లో మొత్తం 1,095 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు పూర్తిగా జిల్లా స్థాయిలో వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా చేపట్టడం జరుగుతుంది.

మొత్తం ఖాళీలు 1,095 కాగా.. వాటిల్లో టైప్-3 KGBVs కింద 352 విద్యాలయాలు, టైప్-4 KGBVs కింద 210 విద్యాలయాలను చేర్చారు. ప్రతి జిల్లాలోని అవసరాన్ని బట్టి పోస్టుల సంఖ్యను కేటాయించారు. కేటగిరీ -3లో గమనిస్తే.. ఏఎన్‌ఎం (Auxiliary Nurse Midwife - ANM),
స్కావెంజర్, అసిస్టెంట్ కుక్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, నైట్ వాచ్‌మన్, హెడ్ కుక్, స్వీపర్ ఉద్యోగాల భర్తికి నోటిఫికేష్ జారీ అయింది.కేటగిరీ - 4 లో.. వార్డెన్, పార్ట్‌టైమ్ టీచర్, చౌకీదార్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ జాబ్స్ ఉన్నాయి.

ap-kgbv-non-teaching-recruitment-2026-1095-vacancies-for-womens

అర్హతలు : మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

విద్యార్హతలు: పోస్టును అనుసరించి 7వ తరగతి నుంచి నుంచి డిగ్రీ వరకు ఉండాలి. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, పార్ట్‌టైమ్ టీచర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో అర్హత తప్పనిసరి.

వయస్సు పరిమితి: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటుంది (రిజర్వేషన్లకు సడలింపు ఉంటుంది)

సెలక్షన్ ప్రాసెస్ : వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హతలు, అనుభవం, అవసరమైతే ప్రాక్టికల్ స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులకు జిల్లా స్థాయి అధికారులు నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు

జీతభత్యాలు

పోస్టును బట్టి సమగ్ర శిక్ష మార్గదర్శకాల ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. పనితీరు ఆధారంగా కాలవ్యవధి పొడిగించే అవకాశం ఉంటుంది

దరఖాస్తు విధానం

దరఖాస్తులు కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తు ఫారాన్ని ప్రత్యక్షంగా సమర్పించాలి. అవసరమైన ధ్రువపత్రాల ప్రతులు జత చేయాలి

అవసరమైన డాక్యుమెంట్స్.

ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, వయస్సు ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), నివాస ధ్రువీకరణ పత్రం, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.

చివరి తేదీ: ఈ నెల 11వ తేదీ వరకు అవకాశం ఉంది.

ఇంటర్వ్యూలు: జిల్లా స్థాయిలో తేదీలను ప్రకటిస్తారు

అభ్యర్థులు ఒకే జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేయాలి. అసంపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడతాయి. ఇంటర్వ్యూ రోజున ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలి. అధికారిక సమాచారం కోసం జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయాన్ని సంప్రదించాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+