AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ !
ఏపీలో ఈ ఏడాది పదో తరగతి (SSC), ఇంటర్ మీడియట్ (inter) పరీక్షలు రాసిన విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం మొదలవుతున్న నేపథ్యంలో వాటి ఫలితాలు (results) ఎప్పుడు విడుదల కాబోతున్నాయో వెల్లడించింది. ఈ మేరకు అభ్యర్ధులకు ముందుగానే ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం లభించింది. టెన్త్ పరీక్షలు రాసిన వారు ఇంటర్ లేదా ఇతర ఉన్నత చదువులకు, అలాగే ఇంటర్ పరీక్షలు రాసిన వారు పోటీ పరీక్షలు, లేదా గ్రాడ్యుయేషన్ కోర్సులకు వెళ్లేందుకు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ఈ ఏడాది టెన్త్, ఇంటర్ పరీక్ష ఫలితాలను ఈ నెలలోనే విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు టెన్త్ పరీక్ష పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి ప్రారంభిస్తోంది. ఇది ఈ నెల 15 వరకూ జరుగుతుంది. అనంతరం ఫలితాలు ప్రాసెస్ చేసేందుకు మరో 8 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇది పూర్తి కాగానే ఏప్రిల్ చివరి వారంలో టెన్త్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు పదో తరగతి హిందీ పేపర్లో అక్షర దోషాల కారణంగా రెండు మార్కులు కలపబోతున్నారు. అలాగే ఇంగ్లీష్ పేపర్ లో లోపాలకు నాలుకు మార్కులు కలపనున్నారు.

అలాగే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఇప్పటికే ప్రారంభమైంది. ఇది ఈ నెల 9తో ముగియనుంది. అనంతరం ఫలితాల ప్రాసెసింగ్, కంప్యూటరీకరణకు మరో ఆరు రోజుల వరకూ పట్టే అవకాశం ఉంది. ఇది పూర్తి కాగానే ఈ నెల మూడోవారంలో ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ 15వ తేదీ తర్వాత ఏ క్షణమైనా ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.












Click it and Unblock the Notifications