AP TET: ఏపీలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ తేదీ ఖరారు-కొత్తగా రెండేళ్ల అప్రెంటిస్ షిప్..!
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా టెట్ నిర్వహించి అనంతరం డీఎస్సీ నిర్వహించనున్నారు. అయితే ఉద్యోగాల భర్తీలో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో డీఎస్సీ నిర్వహణకు ముందు ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫిబ్రవరి 5న నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోనే పరీక్ష తేదీ, ఇతర వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది. అలాగే అదే రోజు డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతున్నారు. ఇందులో డీఎస్సీ పరీక్ష తేదీ, ఇతర వివరాలను ప్రకటిస్తారు. ఈసారి టీచర్ ఉద్యోగాల నియామకాల్లో కీలక మార్పు చేస్తున్నారు.

టెట్ పరీక్షలో పేపర్ 1, పేపర్ 2లు ఉంటాయి. పేపర్ 1లో ఎస్జీటీలకు, పేపర్ 2ను స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారు. టెట్ రాయాలంటే ఎస్జీటీలకు రెండేళ్ల డీఈడీ కోర్సు, స్కూల్ అసిస్టెంట్లకు బీఈడీ కోర్సు అర్హతగా ఉంటాయి. వీటితో పాటు ఎస్జీటీలకు ఓసీలకు ఇంటర్ లో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈసారి కూడా టెట్, డీఎస్సీ పరీక్షల్ని కంప్యూటర్ పైనే నిర్వహిస్తారు. అలాగే డీఎస్సీలో టెట్ పరీక్షలో సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
రాష్ట్రంలో ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు కూడా సచివాలయ ఉద్యోగుల తరహాలో రెండేళ్ల అప్రెంటిస్ షిప్ ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులుగా ఎంపికైన తర్వాత రెండేళ్ల పాటు ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు గౌరవ వేతనంతో పనిచేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే రెండేళ్ల తర్వాత ప్రొబేషన్ ఖరారు చేస్తారు. లేకపోతే పొడిగిస్తారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications