Jobs: APCRDA లో ఉద్యోగాలు, ఇవాళే ఆఖరు తేదీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA)లో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే (మార్చి 2, 2026) చివరి తేదీ అని అధికారులు వెల్లడించారు.

ప్రధానంగా ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఇంజినీరింగ్, ఫైనాన్స్ & సోషల్ సైన్సెస్ విభాగాల్లో నిపుణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి పనుల్లో వేగం పెంచే క్రమంలో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

APCRDA Recruitment 2026 Apply Today for Contract Specialist Posts in Amaravati Deadline Ends March 2nd

మొత్తం నాలుగు రకాల ప్రత్యేక కేటగిరీ పోస్టులకు ఈ నోటిఫికేషన్ జారీ అయింది. ఎన్విరాన్‌మెంటల్ స్పెషలిస్ట్ పోస్టుకు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ లేదా ఇంజినీరింగ్‌లో పీజీ లేదా పీహెచ్‌డీ అర్హత ఉండాలి. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టుకు సీఏ (CA), ఐసీడబ్ల్యూఏ (ICWA), ఎంబీఏ లేదా సీఏఐఐబీ (CAIIB) ఉత్తీర్ణులై ఉండాలి. ప్రొక్యూర్‌మెంట్ స్పెషలిస్ట్ విభాగంలో బీటెక్ (సివిల్) లేదా మరేదైనా ఇంజినీరింగ్ డిగ్రీ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సోషల్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్ పోస్టుకు సోషియాలజీ లేదా సోషల్ వర్క్ వంటి విభాగాల్లో పీజీ పూర్తి చేసిన వారు అర్హులు.

విద్యార్హతలతో పాటు సంబంధిత రంగాల్లో పని అనుభవం ఈ ఉద్యోగాలకు తప్పనిసరి. పోస్టుల స్వభావాన్ని బట్టి 10 నుంచి 15 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థుల అర్హత, గత అనుభవం ఆధారంగా వేతనం నిర్ణయిస్తారు.

ఎంపికైన వారు అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయం వేదికగా పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://crda.ap.gov.in సందర్శించి ఆన్‌లైన్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నేటితో గడువు ముగియనుండటంతో అభ్యర్థులు త్వరపడాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+