నిరుద్యోగులకు ఊరట- ఒకే రోజు రెండు పరీక్షలపై ఏపీపీఎస్సీ ఆఫర్ ఇదే..!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈ నెల 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహిస్తోంది. దీనికి ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 899పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు హాజరవుతున్న పలువురు అభ్యర్ధులు ఎస్బీఐ నిర్వహిస్తున్న క్లర్కు పోస్టుల మెయిన్స్ పరీక్షకు కూడా అదే రోజు హాజరు కావాల్సి ఉంది. అంతే కాదు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీని ఫిబ్రవరి 25న ఎప్పుడో ఖరారు చేశారు. అయినా ఏపీపీఎస్సీ అనాలోచితంగా ఇదే తేదీకి గ్రూప్ 2 పరీక్ష ఖరారు చేసింది. దీనిపై నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమైంది.
ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి గ్రూప్ 2 అభ్యర్ధుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటిని పరిశీలించిన ఏపీపీఎస్సీ తమ నిర్ణయంలో మార్పు మాత్రం చేయలేదు. అయితే ఫిబ్రవరి 25నే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష రాస్తున్న తమ గ్రూప్ 2 అభ్యర్ధులకు మరో విధంగా ఊరట కల్పించింది. ఇలా రెండు పరీక్షలూ ఫిబ్రవరి 25నే రాయాల్సిన పరిస్ధితుల్లో ఉన్న అభ్యర్ధులు ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే మార్పులు చేస్తామని ప్రకటించింది.

అయితే ఈ మార్పు గ్రూప్ 2 పరీక్ష విషయంలో కాదు. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష విషయంలోనే. అదెలాగంటే ఎస్బీఐ తమ క్లర్స్ మెయిన్స్ పరీక్ష కోసం ఫిబ్రవరి 25తో పాటు మార్చి 4న కూడా మరో స్లాట్ పెట్టింది. ఈ రెండు స్లాట్స్ లో తమకు అందుబాటులో ఉన్న స్లాట్ ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు గ్రూప్ 2 రాస్తూ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్ధులు తమకు అధికారిక మెయిల్ [email protected]కి తెలియజేయాలని కోరింది.
గ్రూప్ 2 ప్రిలిమ్స్, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్షల్ని ఫిబ్రవరి 25నే రాయాల్సిన పరిస్ధితుల్లో ఉన్న వారు ఏపీపీఎస్సీకి ఇవాళ (ఫిబ్రవరి 19) సాయంత్రంలోగా మెయిల్ పంపాలని కోరుతోంది. ఇలా మెయిల్ పంపిన వారి ఎస్బీఐ పరీక్ష స్లాట్ మార్చి 4కి మార్చనుంది. అయితే ఇప్పటికే మార్చి 4 స్లాట్ తీసుకున్న అభ్యర్ధులు గ్రూప్ 2 రాస్తుంటే వారు యథావిథిగా రెండు పరీక్షలు రెండు తేదీల్లో రాసుకోవచ్చు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications