APPSC : నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
APPSC : నేడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి : ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేడు హాల్‌టికెట్లను విడుదల చేయనుంది. గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://psc.ap.gov.in/ ఈ వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఏపీపీఎస్సీ షెడ్యూల్ ప్రకారం మార్చి 17న గ్రూప్-1 (AP Group 1) ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.
మార్చి 17 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్-1 పరీక్ష, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను కనీసం ఒకరోజు ముందుగానే చూసుకొని వస్తే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సమయానికి పరీక్షకు హాజరు కావచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది.

పరీక్ష విధానం : ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 స్కీనింగ్ టెస్ట్‌లో భాగంగా మొదట ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 240 మార్కులకు ఉంది. ఇది ఆబ్జెక్టివ్ విధానంలోనే జరుగుతుంది. ఇందులో పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మార్కులకు 120 మార్కులుంటాయి. ఒక్కో పేపర్‌కు 2 గంటల సమయం ఉంటుంది. పేపర్-1 పార్ట్-ఏలో హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్-బిలో రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్-సిలో ఏపీ, ఇండినయ్ ఎకానమీ, ప్లానింగ్, పార్ట్-డిలో జాగ్రఫి నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్స్ పరీక్ష రాసేందుకు అర్హులుగా పరిగణిస్తారు. మెయిన్స్ రాత పరీక్షలో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి.
వీటితోపాటు లాంగ్వేజెస్ పేపర్లు తెలుగు, ఇంగ్లీష్ కూడా అదనంగా ఉంటాయి. అయితే వీటిని క్వాలిఫైయింగ్ పరీక్షలుగా మాత్రమే పరిగణిస్తారు. 750 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం ఐదు పేపర్లలో ఒక్కో పేపర్ కు 150 మార్కులకు చొప్పున పరీక్ష ఉంటుంది. మెయిన్స్‌లో కూడా అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.












Click it and Unblock the Notifications