ఏపీపీఎస్సీ రిక్రూట్‌మెంట్: గెజిటెడ్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్, వెంటనే అప్లై చేయండి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తాజాగా నోటిపికేషన్ జారీ చేసింది. 25 గెజిటెడ్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

తాజా నోటిఫికేషన్ ద్వారా ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, సెరీకల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ డైరెక్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి చివరి తేదీ 2021 డిసెంబర్ 28.

 appsc recruitment 2021: apply for 25-gazetted posts, know jobs details

విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

వయో పరిమతి: వయస్సు వేర్వేరు పోస్టులకు వేర్వేరు విధంగా ఉంది. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు:

ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏఫీ ఫిషరీస్ సర్వీస్)- 11 పోస్టులు
విద్యార్హత: బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్
వయో పరిమితి: 18 నుంచి 42 ఏళ్లు
జీతం: రూ.29,760 బేసిక్ వేతనంతో మొత్తం రూ.80,930

సెరీకల్చర్ ఆఫీసర్ (సెరీకల్చర్ సర్వీస్)- 1 పోస్టు
విద్యార్హత: సెరీకల్చర్, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ సెకండ్ ప్లాస్ కావాలి. బ్యాచిలర్స్ డిగ్రీలో అగ్రికల్చర్
వయో పరిమితి: 18 నుంచి 42 ఏళ్లు
జీతం: రూ.35,120 బేసిక్ వేతనంతో మొత్తం రూ.87,130

అగ్రికల్చర్ ఆఫీసర్ (అగ్రికల్చర్ సర్వీస్)- 6 పోస్టులు
విద్యార్హత: బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్
వయో పరిమితి: 18 నుంచి 42 ఏళ్లు
జీతం: రూ.35,120 బేసిక్ వేతనంతో మొత్తం రూ.87,130

డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏపీ వర్క్స్ అకౌంట్స్ సర్వీస్)-2 పోస్టులు
విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ
వయో పరిమతి: 18 నుంచి 42 ఏళ్లు
జీతం: రూ.29,760 బేసిక్ వేతనంతో మొత్తం రూ.80,930

టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ పోలీస్ సర్వీస్)- 1 పోస్టు
విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్
వయో పరిమతి: 21 నుంచి 28 ఏళ్లు
జీతం: రూ.40,270 బేసిక్ వేతనంతో మొత్తం రూ.93,780

అసిస్టెంట్ కమిషనర్ (ఏపీ ఎండోమెంట్స్ సర్వీస్)- 3 పోస్టులు
విద్యార్హత: న్యాయ శాస్త్రంలో డిగ్రీ
వయో పరిమితి: 28 నుంచి 42 ఏళ్లు
జీతం: రూ.31,460 బేసిక్ వేతనంతో మొత్తం రూ.84,970

అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ హార్టీకల్చర్ సర్వీస్) - 1 పోస్టులు
విద్యార్హత: ఎంఎస్‌సీ హార్టీకల్చర్
వయో పరిమితి: 18 నుంచి 42 ఏళ్లు
జీతం: రూ.40,270 బేసిక్ వేతనంతో మొత్తం రూ.93,780

ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య తేదీలు

దరఖాస్తు ప్రారంభం- 2021 డిసెంబర్ 8

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 28

దరఖాస్తు ఫీజు- అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.250, ఎగ్జామినేషన్ ఫీజ్ రూ.120 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి.

నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Recommended Video

    Ys Jagan Govt చేసింది ఇదీ.. చేయబోతోంది ఇదీ | Ap Jobs Calendar 2021 || Oneindia Telugu

    దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+