వివిధ పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
అమరావతి: రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) ప్రకటించింది. ఈ పరీక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.
ఈ షెడ్యూల్‌లోని పోస్టులన్నింటికీ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష నవంబర్ 7న జరగనుంది. అన్ని పోస్టులకు ఇది కామన్ పేపర్.
దేవాదాయ శాఖ ఈవో స్క్రీనింగ్ ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. పరీక్ష రాసిన మొత్తం 52,915 మందికి గానూ 1278 మంది మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు.

పరీక్షల వివరాలు:
డివజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (పేపర్ 2,3): నవంబర్ 3
ఏపీఆర్వో(పేపర్2): నవంబర్ 4
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (పేపర్ 2): నవంబర్ 4
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉమెన్(పేపర్2): నవంబర్ 5
డీపీఆర్వో (పేపర్ 2,3): నవంబర్ 6
ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ స్త్రీశిశు సంక్షేమం(పేపర్2): నవంబర్ 7
తెలుగు రిపోర్టర్ (పేపర్2): నవంబర్ 16












Click it and Unblock the Notifications