నీట్ యూజీ 2024 అభ్యర్థులకు గమనిక.. త్వరలో ప్రాథమిక కీ విడుదల..
నీట్ యూజీ 2024 అభ్యర్థులకు ఓ ముఖ్య గమనిక.. త్వరలోనే నీట్ యూజీ ప్రాథమిక కీని విడుదల చేస్తున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది. నీట్ యూజీ పరీక్ష ఈ నెల 5వ తేదిన జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే ఆన్సర్ కీని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన ఈ పరీక్షకు మొత్తం 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష పెన్ను పేపర్ విధానంలో జరుగుతుంది. నీట్ యూజీ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు, హిందీ తో పాటు మొత్తం 13 భాషల్లో జరిగింది.
ఈ పరీక్షతో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఈ పరీక్షను ఎన్‌టిఎ ప్రతి ఏడాది నిర్వహిస్తుంది. ఇక, త్వరలోనే నీట్ యూజీ ఆన్సర్ కీ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత నీట్ యూజీ తుది ఫలితాలను వచ్చే నెల 14వ తేదిన విడుదల చేయనున్నట్లు సమాచారం. నీట్ యూజీ 2024 పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. exams.nta.ac.in/NEETలోకి వెళ్లి నీట్ యూజీ పరీక్ష ప్రొవిజనల్ ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, తేదీలను ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నీట్ యూజీ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల ఓఎమ్ఆర్ షీట్, ఆన్సర్ షీట్‌ను కూడా అందుబాటులో ఉంచనుంది. ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు తమ ఫీడ్ బ్యాక్‌ను పంపాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ విజ్క్షప్తి చేసింది. దీనికోసం అభ్యర్థులు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేయు విధానం..
అభ్యర్థులు ముందుగా నీట్ యూజీ exams.nta.ac.in. వెబ్సైట్లోకి వెళ్లాలి.
నీట్ యూజీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి..
అభ్యర్థుల అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయగలరు.
వెంటనే ప్రాథమిక కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ పరీక్షపై మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు [email protected] ఈ-మెయిల్ ను సంప్రదించవచ్చు. ఇతర పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లు.. nta.ac.in, exams.nta.ac.in/NEET సందర్శించగలరు.












Click it and Unblock the Notifications