ఆ బ్యాంకులో 4 వేల ఖాళీలు.. అప్లై చేశారా..?
బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థలో 4,000 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరింకెందుకు ఆలస్యం మీరు అప్లై చేసుకోండి.
మొత్తం ఖాళీలు : మొత్తం ఖాళీలు 4000 ఉన్నాయి. తెలంగాణలో 193, ఏపీలో 59 ఖాళీలు ఉన్నాయి.
అర్హత : అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు : ఫిబ్రవరి 1, 2025 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక :మొదట ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన, లాంగ్వేజ్ ప్రొఫీషియన్సీ టెస్టు ఉంటుంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే తుది జాబితాలో చోటు ఉంటుంది. అప్రెంటిస్ వ్యవధి ఏడాది కాలం పాటు ఉంటుంది. స్టైఫండ్ మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ. 15,000, రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 12,000 లుకా ఉంది.

దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ. 600 కాగా.. దివ్యాంగులు రూ. 400 చెల్లించాలి.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 11 గా ఉంది












Click it and Unblock the Notifications