రూ.1,20,940 జీతంతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..!
నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపికబురు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 115 ఖాళీల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టుల్లో చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ వంటి కీలక విభాగాల నియామకాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 నవంబర్ 30 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలని అనుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్ / బీఈ / ఎంఎస్సీ / ఎంసీఏ లేదా సమానమైన అర్హతను గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసి ఉండాలి. కొన్ని పోస్టులకు రిలవెంట్ వర్క్ ఎక్స్‌పీరియెన్స్ కూడా తప్పనిసరిగా కావచ్చు. ముఖ్యంగా చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులలో బ్యాంకింగ్ రంగంలో అనుభవానికి ప్రాధాన్యం ఇస్తారు.

వయోపరిమితి & సడలింపులు..
2025 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 22 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు అందుబాటులో ఉన్నాయి:
ఎస్సీ / ఎస్టీ : 5 సంవత్సరాలు
ఓబీసీ : 3 సంవత్సరాలు
పీడబ్ల్యూబీడీ : 10 సంవత్సరాలు
ఈ సడలింపులు పై వయోపరిమితికే వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పణ సమయంలో వర్గాల వారీగా ఫీజులు ఈ విధంగా ఉంటాయి:
దరఖాస్తు ఫీజు..
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: రూ.850
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ: రూ.175
ఆన్‌లైన్ చలానా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లింపు తర్వాత దరఖాస్తు ఫైనల్‌గా సమర్పించాలి.
ఎంపిక ప్రక్రియ..
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక పూర్తిగా రాత పరీక్ష + ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ముందుగా ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష డిజైన్ ఈ విధంగా ఉంటుంది:
రాత పరీక్ష విధానం :
మొత్తం మార్కులు: 125
ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ - 25 మార్కులు
ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ - 100 మార్కులు
వ్యవధి: 100 నిమిషాలు
నెగటివ్ మార్కింగ్ వర్తిస్తుంది
రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థుల జాబితా మెరిట్ ఆధారంగా ప్రకటించబడుతుంది.
జీతం..
ఎంపికైన అభ్యర్థులకు పోస్టు ఆధారంగా నెలకు రూ.64,820 నుండి రూ.1,20,940 వరకు జీతం చెల్లిస్తారు. దీనితో పాటు బ్యాంకు ఉద్యోగులకు సాధారణంగా అందే..
HRA
DA
మెడికల్ అలవెన్సులు
పెన్షన్ సదుపాయాలు
లీవ్ ట్రావెల్ కన్సెషన్
వంటి లాభాలు కూడా వర్తిస్తాయి.
పోస్టు వైజ్ ఖాళీల సంఖ్య, కేటగిరీ వర్గీకరణ, ఎంపిక శాతాలు, పరీక్ష సిలబస్ మరియు ఇతర సవివరాలు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవడం మంచిది. మరిన్ని వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications