Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BELలో ఇంజినీర్ ఉద్యోగాలు : మంచి జీతం అర్హతలు ఇవే..!

ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పిస్తోంది. ట్రెయినీ ఇంజినీర్ మరియు ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడదుల చేసింది. కరోనా కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చాలా సంస్థలు నిలిపివేశాయి. అయితే తిరిగి ఉద్యోగాల నియామకాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కూడా ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పూణే డివిజన్‌ నుంచి తాజా ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు పంచకులా యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

BEL Recruitment 2021:Apply for Trainee Engineer and Project engineer jobs

ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన ప్రకారం ట్రైనీ ఇంజినీర్ పోస్టులు 55 ఉండగా ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు 33 ఉన్నాయి. ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు ఉండాలనే నిబంధన పెట్టగా... అదే ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు ఉండాలని సూచించారు. ఇక ప్రభుత్వ పరమైన రిజర్వేషన్లు వర్తిస్తాయి.

ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు కూడా బాగానే ఉన్నాయి. ట్రైనీ ఇంజినీర్‌కు తొలి ఏడాది రూ.25వేలు, రెండవ సంవత్సరంలో రూ.28 వేలు మూడవ సంవత్సరంలో రూ.31వేలు వేతనంగా చెల్లిస్తారు. ఇక ప్రాజెక్టు ఇంజినీర్‌కు తొలి ఏడాది నెలకు రూ.35 వేలు, రెండవ ఏడాది రూ.40 వేలు, మూడవ సంవత్సరంలో రూ.45వేలు, నాల్గవ ఏడాది రూ.50వేలు వేతనంగా చెల్లిస్తారు.

అభ్యర్థులు విద్యార్హతల విషయానికొస్తే నాలుగేళ్ల ఫుల్‌టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇది ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌/ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్‌క్లాస్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పాస్ అయితే చాలు. ట్రైయినీ ఇంజినీర్‌కు ఒక ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. ప్రాజెక్టు ఇంజినీర్‌కు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.

అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ప్రాజెక్టు ఇంజినీర్‌కు జనరల్ అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ప్రాజెక్ట్ ట్రైనీకి రూ.200 ఫీజు చెల్లించాలి.ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం జరుగుతుంది. ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 27 అక్టోబర్ 2021. మరిన్ని వివరాలకు అభ్యర్థులు www.bel-india.comవెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఇంకెందుకు ఆలస్యం.. అన్ని అర్హతలు ఉండి పని అనుభవం కూడా ఉంటే ఈ ఉద్యోగం మీదే కావొచ్చు. అయితే పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికనే అయినప్పటికీ ఒప్పందం పూర్తికాగానే మళ్లీ పెంచే అవకాశాలున్నాయి. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగమే కదా అని నిరుద్యోగులు అర్హతలు ఉండి కూడా అలసత్వం వహించకండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+