BEL Jobs 2025: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా.. !
BEL Bharat Electronics Recruitment 2025: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) మరో ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒకటి కాదు రెండు కాదు.. ఒకే సారి 7 రిక్రూట్ మెంట్లకు దరఖాస్తులను ఆహ్వానించింది. అవును మీరు చదివింది నిజమే. ఈ నియామకాలక సంబంధించిన నోటిఫికేషన్లు బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.inలో విడుదల అయ్యాయి. ఇందులో ట్రైనీ ఇంజనీర్ , జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్, ప్రాజెక్టు ఇంజనీర్ , సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ వంటి ఇతర ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్లకు సంబంధించి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తుల కోసం చివరి తేదీని ఒక్కో రిక్రూట్ మెంట్ కు ఒక్కో విధంగా నిర్ణయించారు.
మొత్తం 192 పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత ప్రభుత్వానికి చెందిన నవరత్న కంపెనీలలో ఒకటి. దీనిలో ఉద్యోగం పొందడానికి ఇదొక సువర్ణావకాశం. ఖాళీల వివరాలు, నియామక చివరి తేదీని ఇక్కడ తెలుసుకోండి.

నియామక వివరాలు ఇలా..
*ట్రైనీ ఇంజనీర్-I/ప్రాజెక్ట్ ఇంజనీర్-I -- మొత్తం 7 పోస్టులు-- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 27, 2025
*జూనియర్ అసిస్టెంట్(హెచ్ఆర్) -- 12 పోస్టులు --చివరి తేదీ ఫిబ్రవరి 25,2025
*సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్(అధికారిక భాష)-- 5పోస్టులు.. చివరి తేదీ ఫిబ్రవరి 26
*ట్రైనీ ఇంజనీర్-I & ప్రాజెక్ట్ ఇంజనీర్-I-- 67+70 పోస్టులు.. చివరి తేదీ ఫిబ్రవరి 20
*సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్(ఈ-1) --8 పోస్టులు-- దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 26
*జూనియర్ అసిస్టెంట్(హెచ్ఆర్) -- ఒక పోస్ట్ -చివరి తేదీ ఫిబ్రవరి 21
*డిప్యూటీ ఇంజనీర్ -- 22 పోస్టులు -- చివరి తేదీ ఫిబ్రవరి 24, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు సంబంధించి ఈ నియామకాలు కోట్ద్వార్, ఘజియాబాద్, పంచకుల, బెంగళూరు, పుణే, నవీ మంబై, మచిలీపట్నం, ఎస్బీయూ యూనిట్లకు సంబంధించి ఉన్నాయి. అభ్యర్థుల అర్హత వయోపరిమితి, జీతంతో సహా ఈ నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్ ద్వారా తనిఖీ చేయవచ్చు. దరఖాస్తు ఫారం, కేటగిరీల వారిగా సర్టిఫికెట్ ఫార్మాట్, ఇతర వివరాలను కూడా నోటిఫికేషన్ తో పాటు వెబ్ సైట్ లో ఇచ్చారు. దాని ప్రకారం అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు
*రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లింక్ ను యాక్సిస్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి: https://bel-india.in/job-notifications/
ఎలా దరఖాస్తు చేయాలి..
*అభ్యర్థులు ఈ నియామకానికి కింద ఇవ్వబడిన దశల సాయంతో దరఖాస్తు చేసుకోవచ్చు.
*ముందుగా బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ bel-india.in ను సందర్శించండి.
*ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ విభాగానికి వెళ్లాలి.
*మీరు దరఖాస్తు ఫారమ్ నింపాల్సిన రిక్రూట్ మెంట్ ఆన్ లైన్ అప్లై లింక్ ను క్లిక్ చేయండి.
*దరఖాస్తును ఆఫ్ లైన్ మోడ్ లో నింపాలనుకుంటే దరఖాస్తు ఫార్మాట్ ను డౌన్ లోడ్ చేసుకుని ఫారమ్ ను పూరించి అవసరమైన పత్రాలతో పాటు సూచించిన చిరునామాకు పంపండి.
*ఆన్ లైన్ దరఖాస్తు లింక్ ఇవ్వబడితే అవసరమైన వివరాలను జాగ్రత్తగా పూరించండి.
*అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేసిన తర్వాత దరఖాస్తు ఫీజును చెల్లించండి.
*దరఖాస్తు చివరి ప్రింట్ అవుట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం సురక్షితంగా భద్రపరచుకోంది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications