నిరుద్యోగులకు BHEL తీపి కబురు.. DON'T MISS
ప్రఖ్యాత భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL) నిరుద్యోగులకు తీపి కబురు ప్రకటించింది. దేశంలోని అతిపెద్ద ఇంజనీరింగ్ & తయారీ సంస్థల్లో ఒకటైన ఇందులో పలు విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 515 ఖాళీలు ఉండగా.. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు గడువు కూడా పెంచడం కలిసొచ్చే విషయం అని చెప్పాలి. ప్రభుత్వరంగ సంస్థలో శాశ్వత ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతభత్యాలు. పింఛన్, మెడికల్, ఇన్సూరెన్స్ వంటి అదనపు లాభాలు.. ఈ ఉద్యోగాలకు మంచి బెనిఫిట్స్ అని చెప్పాలి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

మొత్తం ఉద్యోగాలు..
515
ఉద్యోగ విభాగాలు..
ఆర్టీజన్ పోస్టులు (ఫిట్టర్, వెల్డర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్ మొదలైనవి)
ఖాళీల వివరాలు..
- ఫిట్టర్ : 176 పోస్టులు
- వెల్డర్ : 97 పోస్టులు
- టర్నర్ : 51 పోస్టులు
- ఎలక్ట్రీషియన్ : 65 పోస్టులు
- మెకానిస్ట్ : 104 పోస్టులు
- ఫౌండ్రీ మాన్ : 4 పోస్టులు
- ఎలక్ట్రానిక్ మెకానిక్ : 18 పోస్టులు
విద్యార్హత..
10వ తరగతి +
ఐటీఐ పాస్
వయస్సు పరిమితి..
గరిష్టం 27 సంవత్సరాలు (కేటగిరీల వారీగా వయస్సు సడలింపు ఉంటుంది). నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం..
నెలకు రూ. 29,500 నుంచి రూ.65,000 వరకు
దరఖాస్తు గడువు..
ఇప్పటికే దరఖాస్తు గడువు ప్రారంభమవగా.. చివరి తేదీగా సెప్టెంబర్ 12, 2025 నిర్ణయించారు.
ఎంపిక విధానం..
లిఖిత పరీక్ష (Written Test)
ట్రేడ్ టెస్ట్ / స్కిల్ టెస్ట్
డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
చివరగా మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ ను https://bhel.com సంప్రదించవచ్చు.
దరఖాస్తు విధానం..
అభ్యర్థులు BHEL అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్ధులకు సూచనలు..
అలానే దరఖాస్తు చేసేముందు పూర్తి నోటిఫికేషన్‌ని చదవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత హార్డ్ కాపీని భద్రపరచుకోవాలి.












Click it and Unblock the Notifications