CBSE 10th Result 2026 OUT: సీబీఎస్ఐ టెన్త్ ఫలితాలు విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!
కేంద్ర ప్రాధమిక విద్యాబోర్డు సీబీఎస్ఈ ఈ ఏడాది పదో తరగతి విద్యార్ధులకు నిర్వహించిన బోర్డు ఫలితాలు (CBSE 10th Result 2026 ) ఇవాళ విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లైన cbse.gov.in, results.cbse.nic.in లలో, అలాగే ఉమాంగ్ యాప్, డిజిలాకర్‌లో కూడా చూసుకోవచ్చు. 2026 సంవత్సరానికి సంబంధించిన సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 11 మధ్య జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
అధికారిక వెబ్‌సైట్‌లతో పాటు, ఫలితాలను డిజిలాకర్ లో కూడా అందుబాటులో ఉంచారు. ఇందులో విద్యార్థులు తమ డిజిటల్ మార్క్‌షీట్‌లను తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల ప్రకటన తర్వాత, వాటిని చెక్ చేయడానికి డైరెక్ట్ లింక్ యాక్టివేట్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవడానికి రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడి, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ తప్పనిసరి.

ఇవాళ ప్రకటించిన సీబీఎస్ టెన్త్ పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చిన వారికి మేలో జరిగే రెండవ బోర్డు పరీక్షల్లో మూడు సబ్జెక్టుల వరకు ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇవాళ 10వ తరగతి మొదటి పరీక్ష ఫలితాలు వెలువడటంతో, విద్యార్థులు రెండవ బోర్డు పరీక్షకు హాజరు కావాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. మార్చి 17 నాటి నోటీసు ప్రకారం, ఆసక్తి ఉన్న విద్యార్థులందరి అభ్యర్థుల జాబితాను పాఠశాలలు సమర్పిస్తాయి. రెండవ బోర్డు పరీక్షకు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు గమనించవలసిన విషయం ఏమిటంటే, రెండవ పరీక్షకు సబ్జెక్టు మార్పుకు అనుమతి లేదు. మొదటి పరీక్ష నుండి రెండవ పరీక్షకు విద్యార్థి డేటాలో ఎటువంటి సవరణను బోర్డు అనుమతించదు.












Click it and Unblock the Notifications