CBSE Admit Cards: సీబీఎస్ఈ 10, 12 అడ్మిట్ కార్డులపై అప్ డేట్- వివరాలివే..!
కేంద్ర ప్రాధమిక విద్యా బోర్డు సీబీఎస్ఈ(CBSE) ఈ ఏడాది 10, 12 తరగతుల బోర్డు పరీక్షల నిర్వహణకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా 10, 12 తరగతుల విద్యార్ధులకు అడ్మిట్ కార్డుల్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఈ అడ్మిట్ కార్డుల్ని తాము చదువుకుంటున్న స్కూళ్ల నుంచే పొందే అవకాశం ఉంది. ప్రైవేటుగా రాసే విద్యార్ధులు మాత్రం నేరుగా వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
సీబీఎస్ఈ 10, 12 క్లాసుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అడ్మిట్ కార్డులు ఈ వారంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది కూడా ఫిబ్రవరి మొదటి వారంలోనే వీటిని విడుదల చేశారు. ఈసారి కూడా మరో నాలుగైదు రోజుల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15నుంచి మార్చి 13 వరకూ జరగనున్నాయి.

అలాగే సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డ్ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరుగుతాయి. ఈసారి కూడా ఒకే సెషన్ లో 10, 12 క్లాసుల బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతీ పరీక్ష ఉదయం 10:30 గంటలకు మొదలు కానుంది. వీటి కోసం అడ్మిట్ కార్డుల్ని అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లో అందుబాటులో ఉంచుతారు. సీబీఎస్ఈ బోర్డు అడ్మిట్ కార్డులు విడుదల చేయగానే అభ్యర్ధులు వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
10, 12 తరగతులకు అడ్మిట్ కార్డులు సాధారణ, ప్రైవేట్ అభ్యర్థులకు వేర్వేరుగా పంపిణీ చేస్తారు. రెగ్యులర్ విద్యార్థులు తమ పాఠశాల అధికారుల ద్వారా అడ్మిట్ కార్డులను పొందాల్సి ఉంటుంది. అలాగే రెగ్యులర్ విద్యార్ధులు అడ్మిట్ కార్డులపై స్కూల్ ప్రిన్సిపాల్స్ సంతకాలు చేయించుకుని వస్తేనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రైవేట్ అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను బోర్డు వెబ్‌సైట్ cbse.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతరత్రా వివరాలకు అధికారిక వెబ్ సైట్, హెల్ప్ డెస్క్ లను సంప్రదించవచ్చు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications