CBSE Exams: సీబీఎస్ఈ బోర్డు పరీక్షల డేట్ షీట్స్ విడుదల-తేదీలు ఇవే..!
కేంద్ర ప్రాథమిక విద్య బోర్డు (సీబీఎస్ఈ) వచ్చే ఏడాది నిర్వహించే 10, 12 తరగతుల బోర్డు పరీక్షల కోసం ఇవాళ టైం టేబుల్ విడుదల చేసింది. ఇందులో 10, 12 తరగతుల ప్రధాన పరీక్షలతో పాటు 12వ తరగతి స్పోర్ట్స్ విద్యార్ధులకు, 10వ తరగతి సెకండరీ బోర్డు పరీక్షలకూ, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకూ టైం టేబుల్స్ విడుదల చేశారు. వీరికి బోర్డు పరీక్షల తేదీలతో పాటు ఇతర వివరాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి జూలై 15 వరకూ ఇవి జరుగుతాయి.
సీబీఎస్ఈ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మన దేశంతో పాటు 26 దేశాలలో మొత్తం 204 సబ్జెక్టులలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో రాత పరీక్షలతో పాటు, ఫలితాలను సకాలంలో ప్రకటించడానికి ప్రాక్టికల్స్, మూల్యాంకనం, ఫలితాల తర్వాత ప్రక్రియలు కూడా ఉన్నాయి. సీబీఎస్ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి సబ్జెక్టు పరీక్ష తర్వాత దాదాపు 10 రోజుల తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుంది.

అలాగే 12 రోజుల్లోపు ఈ మూల్యాంకనం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఉదాహరణకు 12వ తరగతి భౌతిక శాస్త్ర పరీక్ష ఫిబ్రవరి 20న జరిగితే మూల్యాంకనం మార్చి 3న ప్రారంభమై మార్చి 15 నాటికి ముగుస్తుంది. ఈ తేదీ షీట్లు తాత్కాలికమేనని సీబీఎస్ఈ తెలిపింది. పాఠశాలలు అభ్యర్థుల తుది జాబితాను సమర్పించిన తర్వాత తుది వెర్షన్లు విడుదల చేస్తామని వెల్లడించింది. కాబట్టి విద్యార్ధులు సీబీఎస్ఈ విడుదల చేసే తుది జాబితా తర్వాత పరీక్షల తేదీల్ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications