CBSE: ఓపెన్ బుక్ పరీక్షలపై సీబీఎస్ఈ క్లారిటీ ఇదే..! ట్రయల్ రన్ స్ధానంలో స్టడీ..
దేశవ్యాప్తంగా జాతీయ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ ప్రకారం 9 వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ నిర్వహించే పరీక్షల్లో ఓపెన్ బుక్ విధానం తీసుకురావాలని సీబీఎస్ఈ చేస్తున్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వస్తోంది. ఓపెన్ బుక్ విధానంలో పుస్తకాలతో పరీక్షలు రాయిస్తే మంచిదని కొందరు, వద్దే వద్దని మరికొందరు సూచిస్తున్నారు. దీంతో ఓపెన్ బుక్ విధానం కాస్తా పైలట్ రన్ కు ముందే వివాదాస్పదంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ స్పందించి క్లారిటీ ఇచ్చింది.
అసలు విషయానికొస్తే.. తాజాగా సీబీఎస్ఈ గతేడాది అమల్లోకి వచ్చిన జాతీయ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ ప్రకారం సీబీఎస్ఈలో 9 నుంచి 12వ తరగతి వరకూ విద్యార్ధులకు ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలకు ప్రతిపాదించింది. అలాగే ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ లో వీటిని ట్రయల్ రన్ వేయాలని కూడా భావించింది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పుస్తకాలతో పరీక్షల నిర్వహణ వల్ల వచ్చే ఇబ్బందులపై కూడా చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సీబీఎస్ఈ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. ఓపెన్ బుక్ విధానంలో ఇప్పటికిప్పుడు పరీక్షలు నిర్వహించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఓపెన్ బుక్ విధానం సాధ్యాసాధ్యాలతో సీబీఎస్ఈ స్కూళ్లలో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. దేశంలోని స్కూళ్ల పరిస్ధితుల్లో ఓపెన్ బుక్ విధానం అమలు సాధ్యమవుతుందా లేదా అన్నది పరిశీలిస్తామని వెల్లడించింది. ఈ నివేదికల ఆధారంగా తదుపరి నిర్ణయం ఉంటుందని పేర్కొంది.
వాస్తవానికి సీబీఎస్ఈ 9, 10 తరగతులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ఇలా ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు ట్రయల్ రన్ లో నిర్వహించాలని భావించింది. అలాగే 11, 12 తరగతులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజీలో ఇలా పరీక్షలు ట్రయల్ రన్ లో నిర్వహించాలని భావించింది. ఇందులోపరీక్షలు రాసేందుకు విద్యార్ధులకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ తో పాటు ఇతర స్టడీ మెటీరియల్ కూడా వాడుకునేందుకు అనుమతిస్తారు. కానీ ఆలోపే విమర్శలు రావడంతో మరింత అధ్యయనం చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించింది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications