CBSE 10, 12 తరగతుల అడ్మిట్ కార్డుల విడుదలకు ఏర్పాట్లు-ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు..!
కేంద్ర ప్రాధమిక విద్యా బోర్డు సీబీఎస్ఈ ఏటా నిర్వహించే 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరిగే ప్రధాన పరీక్షల కోసం కూడా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వీటిలో భాగంగా ముందుగా అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు. దీంతో అడ్మిట్ కార్డుల కోసం పరీక్షలకు హాజరయ్యే విద్యార్దులు కూడా ఎదురుచూస్తున్నారు.
సీబీఎస్ఈ 10, 12 క్లాసుల బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అడ్మిట్ కార్డుల్ని గతేడాది ప్రకారం చూస్తే ఫిబ్రవరి మొదటివారంలో విడుదల చేస్తారు. కానీ ఈసారి అంతకన్నా ముందే విడుదల చేయొచ్చని తెలుస్తోంది. ఈసారి సీబీఎస్ఈ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 10వ తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై మార్చి 13న ముగుస్తాయి. అలాగే 12వ తరగతి బోర్డ్ పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి.

ఒకే సెషన్ లో రెండు క్లాసుల బోర్డు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతీ పరీక్షా ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. వీటి కోసం అడ్మిట్ కార్డుల్ని అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in లో అందుబాటులో ఉంచనున్నారు. సీబీఎస్ఈ బోర్డు అడ్మిట్ కార్డులు విడుదల చేయగానే అభ్యర్ధులు వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 10, 12 తరగతులకు అడ్మిట్ కార్డులు సాధారణ, ప్రైవేట్ అభ్యర్థులకు వేర్వేరుగా పంపిణీ చేస్తారు. రెగ్యులర్ విద్యార్థులు తమ పాఠశాల అధికారుల ద్వారా అడ్మిట్ కార్డులను పొందాలి. ప్రైవేట్ అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లను బోర్డు వెబ్‌సైట్ cbse.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications