UPSC:సివిల్ స‌ర్వీసెస్ 2023 ఇంట‌ర్వ్యూ షెడ్యూలు విడుద‌ల చేసిన యూపీఎస్సీ..

సివిల్ సర్వీసెస్ 2023 ఇంటర్వ్యూ తేదీలను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఇంట‌ర్య్వూలు ఉంటాయి. అభ్యర్థుల రోల్‌ నంబర్‌, ఇంటర్వ్యూ తేదీ, సమయం వివరాలను యూపీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే ఇ-సమన్‌ లెటర్లు వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ పేర్కొన‌డం జ‌రిగింది. సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు సివిల్స్‌ ప్రధాన పరీక్షలను నిర్వ‌హించారు. ఇక ఈ ఏడాది డిసెంబర్‌ 8న ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. మెయిన్స్‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది.

తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 90 మంది అర్హ‌త : మెయిన్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 2,844 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. మెయిన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థుల‌ను ప‌ర్సనాలిటీ టెస్ట్‌కు షార్ట్ లిస్ట్ చేయ‌డం జ‌రిగింది. ఈ ఇంటర్వ్యూలు ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాల‌యంలో నిర్వహిస్తారు. మే నెలలో జరిగిన ప్రీలిమిన‌రీ పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది హాజరయ్యారు. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. ఈ ఇంటర్వ్యూలకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 90 మంది వరకు ఎంపికయ్యి ఉండోచ్చ‌ని స‌మాచారం. గతేడాది ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 40 మంది వరకు సివిల్ సర్వీస్ కొలువులకు ఎంపికయ్యారు.

Civil Services 2023 Interview Schedule Released by UPSC..

ఇంట‌ర్వ్యూ మొత్తం 275 మార్కులకు ఉంటుంది : ఇంట‌ర్వ్యూ ప్రతిభ‌, మెయిన్స్, ప్రిలిమ్స్ మార్కుల‌ను బ‌ట్టి ఆలిండియా స‌ర్వీసుల‌కి అభ్యర్థుల‌ను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశలో ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో డీటైల్డ్‌ అప్లికేషన్‌ ఫాం-2 అందుబాటులో ఉంటుంది. ఇది పూర్తిచేసిన అభ్యర్థులకే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంట‌ర్వ్యూ మొత్తం 275 మార్కులకు ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+