కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్, మన రాష్ట్రాల్లో ఖాళీలివే!

దేశంలోనే అతిపెద్ద పారా మిలిటరీ బలగమైన సీఆర్‌పీఎఫ్ (CRPF) భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు తెరలేపింది. మొత్తం 9,175 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో పురుష అభ్యర్థులకు 9,096 పోస్టులు, మహిళా అభ్యర్థులకు 79 పోస్టులు కేటాయించారు. టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ - పయనీర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల వివరాలు

ఈ నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ అభ్యర్థులకు ప్రత్యేకంగా పోస్టులను కేటాయించారు

  • ఆంధ్రప్రదేశ్: 504 పోస్టులు
  • తెలంగాణ: 356 పోస్టులు

స్థానిక యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు.

CRPF Recruitment 2026 Apply Online for 9 175 Constable Posts Check Eligibility and Vacancies in Telugu States

అర్హతలు -వయసు పరిమితి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి కింది విద్యార్హతలు కలిగి ఉండాలి:

  • విద్యార్హత: కనీసం పదో తరగతి (10th), ఇంటర్మీడియట్ లేదా సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ITI) ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది).

ముఖ్యమైన తేదీలు - దరఖాస్తు విధానం

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 20, 2026.
  • చివరి తేదీ: మే 19, 2026.

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం మరియు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://rect.crpf.gov.in/ ను సందర్శించవచ్చు.

ఎంపిక ప్రక్రియ

కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), శారీరక సామర్థ్య పరీక్ష (PET), శారీరక ప్రమాణాల పరీక్ష (PST) మరియు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. దేశ రక్షణలో భాగస్వాములు కావాలనుకునే యువత ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+