CRPF recruitment: 9360కి పెరిగిన పోస్టులు, గడువు తేదీ పొడిగింపు, కీలక విషయాలు
న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో 9212 కానిస్టేబుల్(టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. మార్చిలో వెలువడిన ఈ నోటిఫికేషన్లో పలు కీలక సవరణలు చేశారు. దరఖాస్తుల గడువు ఏప్రిల్ 25తో ముగియనుండగా.. ఆ గడువును మే 2 వరకు పొడిగిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ వెల్లడించింది. అభ్యర్థుల సౌలభ్యం కోసమే ఈ గడువును పొడిగించినట్లు పేర్కొంది. అలాగే అభ్యర్థుల వయోపరిమితి నిబంధనల్లోనూ మార్పులు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష/మహిళా అభ్యర్థుల నుంచి మార్చి 27 నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. కాగా, కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టులకు గతంలో 21-27 ఏళ్ల వయో పరిమతి విధించగా దాన్ని ప్రస్తుతం 21-30 ఏళ్లకు పెంచింది. కానిస్టేబుల్(మోటార్ మెకానిక్ వెహికిల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్‌మన్, బార్బర్, సఫాయి కర్మచారి, మేసన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ) పోస్టులకు గతంలో వయో పరిమితి 18-23 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం 18-26 ఏళ్లకు మార్పు చేసింది.

పోస్టుల ఖాళీల్లోనూ మార్పులు చేసింది. గతంలో 9212 కానిస్టేబుల్ పోస్టులకు అదనంగా మరో 148 ఉద్యోగాలను జత చేయడంతో ఖాళీల సంఖ్య ప్రస్తుతం 9360కి పెరిగింది. అభ్యర్థుల ఎత్తు, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టుకు సంబంధించిన పలు మార్పులు కూడా చేసినట్లు సీఆర్పీఎఫ్ వెల్లడించింది.
సీఆర్పీఎఫ్ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాలు, అప్లై చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications