సీటెట్ 2024 రిజ‌ల్ట్ వ‌చ్చేసాయ్‌... ఇలా చెక్ చేసుకోండి...

సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) జనవరి-2024 ఫ‌లితాలు వ‌చ్చేసాయి. సీటెట్ ఫ‌లితాల‌ను సీబీఎస్‌ఈ ఫిబ్ర‌వ‌రి 15న విడుద‌ల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు త‌మ ఫ‌లితాల‌ను సీటెట్ అధికారిక వెబ్‌సైట్‌ https://ctet.nic.in/ లో రోల్‌ నంబర్‌, పుట్టిన‌తేది వివరాలతో ఫలితాలను చెక్‌ చేసుకోగ‌ల‌రు.

సెంట్ర‌ల్ టీచ‌ర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ దేశవ్యాప్తంగా జనవరి 21వ తేదీన జరిగిన విషయం విదిత‌మే. జనవరి 21, 2024న సీటెట్-జ‌న‌వ‌రి సెష‌న్ 2024 ఆఫ్‌లైన్‌లో నిర్వ‌హించారు. ఓఎమ్ఆర్ ప‌ద్ధ‌తిలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష రెండు షిప్టుల‌లో జ‌రిగింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేప‌ర్ ప‌రీక్ష జ‌ర‌గ‌గా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వ‌ర‌కు పేప‌ర్ 1 ప‌రీక్ష జ‌రిగింది.

 CTET 2024 result is out... check this...

ఈ సీటెట్ ప‌రీక్ష‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం రెండు సార్లు నిర్వ‌హిస్తారు. సీటెట్ రెండు పేపర్లు కూడా ఆఫ్‌లైన్ విధానంలో జ‌రిగింది. సెంట్ర‌ల్ టీచ‌ర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ మొత్తం 20 భాష‌ల్లో నిర్వ‌హించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది.

మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారి కోసం ఉంటుంది. ఇక రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహించారు. సెంట్ర‌ల్ టీచ‌ర్ ఎలిజ‌బిలిటి టెస్ట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప‌రీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

జ‌న‌వ‌రి 21న జ‌రిగిన ప‌రీక్ష‌...

జ‌న‌వ‌రి 21న ఆఫ్‌లైన్‌లో జ‌రిగిన ఈ ప‌రీక్ష‌కు ఫిబ్ర‌వ‌రి 8, 2024 ఆన్స‌రీ కీని విడుద‌ల చేసింది. ఈ ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను ఫిబ్ర‌వ‌రి 10వ తేదీలోగా తెలియ‌జేయాల‌ని సిబిఎస్ఇ బోర్డు తెలిపింది. ఇక‌, ఫిబ్ర‌వ‌రి 15వ తేదిన తుది ఫ‌లితాల‌ను బోర్డు ప్ర‌క‌టించింది. ఈ ఫ‌లితాల‌ను చెక్‌చేసుకునేందుకు అభ్య‌ర్థులు సీటెట్ https://ctet.nic.in/ అధికారిక వెబ్‌సైట్‌లో రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఫ‌లితాల‌ను చెక్‌చేసుకోగ‌ల‌రు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+