CUET UG : సీయూఈటీ యూజీ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు రిలీజ్..
సీయూఈటీ - యూజీ 2024 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానీ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ సీయూఈటీ యూజీ పరీక్ష నిర్వహిస్తారు. ఇక, త్వరలోనే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు విడుదల కానున్నాయి. ఈ పరీక్ష ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్ష రోజుకు రెండు మూడు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన సిటి ఇంటిమేషన్ స్లిప్పులను ఎన్‌టిఎ ( నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) విడుదల చేసింది.
సీయూఈటీ (యూజీ) 2024 పరీక్షకు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ పరీక్షలు ఈ నెల15వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య వివిధ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ (NTA) తెలిపింది. ఈ పరీక్షలు మొత్తం 27 సబ్జెక్టుల్లో జరుగుతుంది. 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. సీయూఈటీ పరీక్ష దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లోని 26 పట్టణాల్లో నిర్వహించనున్నారు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను జూన్ 30న విడుదల చేయనున్నారు. ఈ సారి ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా ఆరు సబ్జెక్టుల్ని మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో కేవలం పది సబ్జెక్టులకు మాత్రమే అవకాశం కల్పించారు. అభ్యర్థులు సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, అడ్మిట్ కార్డులకు సంబంధించిన వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://exams.nta.ac.in/CUET-UG/ సంప్రదించగలరు.

పరీక్ష విధానం ఇలా...
సీయూఈటీ యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా నిర్వహిస్తారు. మొదటి సెక్షన్‌లో 1ఎ, 1బి లాంగ్వేజ్‌లో ఉంటుంది. రెండో సెక్షన్ కేవలం అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు మాత్రమే ఉంటుంది. మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో అబ్జెక్టివ్ టైప్‌లో ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఐదు మార్కులు ఉంటాయి. ఇందులో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలు అడుగుతారు. 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. రెండో సెక్షన్‌లోనూ 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.












Click it and Unblock the Notifications