నేటి నుంచే ప్రారంభ‌మ‌యిన ఈఎంఆర్‌ఎస్ ప‌రీక్ష‌లు...

EMRS Recruitment Exam 2023 : దేశ‌వ్యాప్తంగా ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 10,391 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక పరీక్షలు నేటి నుంచే ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను అధికారులు డిసెంబరు 14న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టులవారీగా హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ప‌రీక్ష‌లు డిసెంబర్‌ 16, 17, 23, 24 తేదీల్లో నిర్వహించనున్నారు.

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (నెస్ట్స్‌) నియామక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్‌ సెక్రెటేరియట్‌ అసిస్టెంట్/ ల్యాబ్‌ అసిస్టెంట్‌/ టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయ‌డం జ‌రుగుతుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం http://emrs.tribal.gov.in/ ఈ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

EMRS Exams Started From Today...

మొత్తం ఖాళీల వివరాలు : 10391

I. ఖాళీలు: 4062

పోస్టుల వారీగా ఖాళీలు..

1) ప్రిన్సిప‌ల్‌: 303 పోస్టులు

అర్హత: బీఈడీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 50 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.78,800-రూ.2,09,200.

2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ): 2266 పోస్టులు

అర్హత: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 40 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.47,600-రూ.1,51,100.

3) అకౌంటెంట్‌: 361 పోస్టులు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.35,400-రూ.1,12,400.

4) జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ (JNA): 759

అర్హత: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 30 సంవత్సరాలకు మించకూడదు.

జీతభత్యాలు: రూ.19900-రూ.63200

5) ల్యాబ్‌ అటెండెంట్‌: 373

అర్హత: పదోతరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

II. మొత్తం ఖాళీలు: 6,329.

ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 5,660 పోస్టులు

హిందీ: 606 పోస్టులు
ఇంగ్లిష్: 671 పోస్టులు
మ్యాథ్స్‌: 686 పోస్టులు
సోషల్‌ స్టడీస్‌: 670 పోస్టులు
సైన్స్: 678 పోస్టులు
బెంగాలీ: 10 పోస్టులు
గుజరాతీ: 44 పోస్టులు
కన్నడ: 24 పోస్టులు
మలయాళం: 02 పోస్టులు
మణిపురి: 06 పోస్టులు
మరాఠీ: 52 పోస్టులు
ఒడియా: 25 పోస్టులు
తెలుగు: 102 పోస్టులు
ఉర్దూ: 06 పోస్టులు
మిజో: 02 పోస్టులు
సంస్కృతం: 358 పోస్టులు
సంతాలి: 21 పోస్టులు
మ్యూజిక్‌: 320 పోస్టులు
ఆర్ట్‌: 342 పోస్టులు
పీఈటీ (మెన్): 321 పోస్టులు
పీఈటీ (ఉమెన్): 345 పోస్టులు
లైబ్రేరియన్: 369 పోస్టులు
హాస్టల్ వార్డెన్ (పురుషులు): 335 పోస్టులు
హాస్టల్ వార్డెన్ (మహిళలు): 334 పోస్టులు
వ‌య‌స్సు : 18.8.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హ‌త‌లు : టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+