EMRS Result 2023 : ఏకలవ్య మోడల్ స్కూళ్ల ఫలితాలు విడుదల...
దేశంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రాతపరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్ఎస్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 10.391 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది.
గతేడాది జూన్ నెలాఖరున 4,062 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, అనంతరం కొద్ది రోజులకే మరో 6,329 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మొత్తంగా రెండు నోటిఫికేషన్లకు కలిపి 10,391 ఉద్యోగాలను భర్తిచేయనున్నారు. ఇందులో ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, హాస్టల్ వార్డెన్, సహా పలు నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి నేషనల్ ఎడ్యుకేషన్ సోసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (NESTS) నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ రాతపరీక్షకు సంబంధించన ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఇందులో ప్రిన్సిపల్, పీజీటీ, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు- జులై 31, 2023న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులకు ఆగస్టు 18, 2023న దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://emrs.tribal.gov.in/ ఈ వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్‌చేసుకోగలరు.
పోస్టుల ఖాళీలను వివరాలు ఓసారి పరిశీలిద్దాం...
ఏకలవ్య మోడల్ స్కూళ్లోని 4,062 పోస్టులకు సంబంధించి గతంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌లో ప్రిన్సిపల్-303 పోస్టులు, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)-2266 పోస్టులు, ఇక నాన్‌టీచింగ్ క్యాటగిరీలో ఉన్న అకౌంటెంట్-361 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్- 759 పోస్టులు ఉన్నాయి. ఇక, ల్యాబ్ అటెండెంట్-373 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. వీటితోపాటు మరో నోటిఫికేషన్‌లో 6,329 పోస్టులు. అందులో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటి) 5660 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు హాస్టల్ వార్డెన్ పురుషుల విభాగంలో 335 పోస్టులు ఖాళీగా ఉండగా, మహిళల విభాగంలో 334 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications