FMGE Admit Cards : ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష అడ్మిట్ కార్డుల విడుదల- ఇలా చెక్ చేసుకోండి..

విదేశాల్లో వైద్య పట్టభద్రుల కోర్సుల కోసం నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష డిసెంబర్ 2023 సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఇవాళ విడుదలవుతున్నాయి. ఒక అభ్యర్థి విదేశీ సంస్థలో మెడికల్ కోర్సులో అడ్మిషన్ తీసుకునే ముందు మెడికల్ కౌన్సిల్ నుంచి అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఇలా అర్హత కలిగిన అభ్యర్ధులకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష రాసి సదరు కోర్సుకు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్ 2023 సెషన్ కు సంబంధించిన పరీక్ష జనవరి 20న జరగనుంది.

ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష డిసెంబర్ 2023 సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డుల్ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. వీటిని డౌన్ లోడ్ చేసుకునే విధానాన్ని కూడా షేర్ చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్ సైట్ natboard.edu.in లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అభ్యర్ధులు ఎలా ఈ అడ్మిట్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసుకోవాలో ఓసారి చూద్దాం..

FMGE Admit Cards December 2023 release today- here is how to download

ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ డిసెంబర్ సెషన్ పరీక్ష 2023 రాయాలనుకునే అభ్యర్ధులు ముందుగా అధికారిక వెబ్ సైట్ natboard.edu.inలోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ హోంపేజీపై FMGE December 2023 admit card లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే.. లాగిన్ వివరాలు అడుగుతుంది. వాటిని ఎంటర్ చేసి సబ్మిట్ బయట్ ప్రెస్ చేయాలి. అప్పుడు అడ్మిట్ కార్డు కనిపిస్తుంది. దీన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని ఉంచుకుంటే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ డిసెంబర్ సెషన్ పరీక్ష జనవరి 20న రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. ఉదయం 9 నుండి 11.30 వరకు ఓ సెషన్, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ గా ఉంటుంది. పరీక్షలో భాగంగా 300 బహుళ-ఎంపిక ప్రశ్నలతో కూడిన ఒక పేపర్‌ను ఉంటుంది. పేపర్‌ను రెండు సెగ్మెంట్‌లుగా ఇస్తారు. రెండూ ఒకే రోజు పూర్తవుతాయి. ప్రతి సెగ్మెంట్ లో 150 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్ధులు 150 నిమిషాల్లో వాటికి సమాధానం రాసి ఇవ్వాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+