Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐబీపీఎస్ టూ టీసీఎస్ వరకు ఉద్యోగాల వివరాలు: ఈ వారంలోనే అప్లై చేయండి

న్యూఢిల్లీ: ఐబీపీఎస్ నుంచి టీసీఎస్, అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇస్రో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశాయి. గ్రాడ్యూయేషన్, పోస్టు గ్రాడ్యూయేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ రైల్వేలో అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్:

ఇండియన్ రైల్వేలో అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్:

నార్త్ సెంట్రల్ రైల్వేస్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) ఎన్సీఆర్‌లోని వివిధ ట్రేడ్‌లు, వర్క్‌షాప్‌లు, విభాగాలలో 1664 పోస్టుల కోసం అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబరు 1న లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ https://www.rrcecr.gov.in/ సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ఐబీపీఎస్ స్పెషాలిటీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2021

ఐబీపీఎస్ స్పెషాలిటీ ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ 2021

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) భారతదేశంలోని అనేక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1828 స్పెషాలిటీ ఆఫీసర్స్ (ఎస్ఓ) ఖాళీల కోసం నియామకం చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ ప్రాధాన్య పోస్ట్ కోసం ibps.inలో దరఖాస్తు చేయవచ్చు. నవంబర్ 23లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐటీ ఆఫీసర్ (220), అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (884), రాజభాష అధికారి (84), లా ఆఫీసర్ (44), హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్ (61), మార్కెటింగ్ ఆఫీసర్((535) పోస్టులతో సహా 1828 స్పెషలిస్ట్ ఆఫీసర్‌ల ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అధికారిక వెబ్‌సైట్ https://ibps.in/ సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇస్రోలో జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్స్

ఇస్రోలో జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్స్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) సంస్థ 6 జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 20 లేదా అంతకు ముందు దరఖాస్తు చేసుకోవచ్చు. పే మ్యాట్రిక్స్‌లో పే స్కేల్ ఆరో స్థాయి, ఇది రూ. 35,400 నుంచి రూ. 1,12,400 ఉంటుంది. దరఖాస్తు వివరాల ఇస్రో అధికారిక వెబ్‌సైట్ సంప్రదించవచ్చు.

టీసీఎస్ రిక్రూట్‌మెంట్

టీసీఎస్ రిక్రూట్‌మెంట్

బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ డిగ్రీలు ఉన్న అభ్యర్థులు నవంబర్ 15లోగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారు తమ 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో (వర్తిస్తే) కనీసం 60 శాతం మార్కును పొంది ఉండాలి. అభ్యర్థులు వ్రాత పరీక్ష తర్వాత పర్సనాలిటీ ఇంటర్వ్యూ రౌండ్‌ను క్లియర్ చేయాలి. మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. https://www.tcs.com/careers)

Recommended Video

    AP Government Schools లో TCs తో పని లేకుండా చేరిక... ఇబ్బంది పెడుతున్న Private Schools || Oneindia
    అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ష్రెఫర్స్ రిక్రూట్‌మెంట్

    అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ష్రెఫర్స్ రిక్రూట్‌మెంట్

    ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వాయిస్, నాన్-వాయిస్ కస్టమర్ సపోర్ట్ పోస్ట్‌ల కోసం ఫ్రెషర్‌ల కోసం వెతుకుతున్నాయి. ఉద్యోగ స్థానం హర్యానాలోని ఫరీదాబాద్, జాబ్ టైం: పూర్తి సమయం. అభ్యర్థులు తప్పనిసరిగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అదనపు పనితీరు బోనస్‌తో నెలకు జీతం శ్రేణి రూ. 12,475 నుండి రూ. 23,587. పోస్టుల వివరాల కోసం సంబంధిత అధికార వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+